శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 28 మే 2016 (16:17 IST)

ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చా : నటుడు వేణుమాధవ్‌

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుని ఆదర్శంగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు టాలీవుడ్ హాస్య నటుడు వేణుమాధవ్‌ అన్నారు. అందువల్ల తనకు ఎన్‌టిఆర్‌ దైవంతో సమానమన్నారు. 
 
తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో వేణుమాధవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పౌరాణిక వేషాలు వేయాలంటే అప్పట్లో ఎన్‌టిఆర్‌కే సాధ్యమన్నారు. ఎన్‌టిఆర్‌ పౌరాణిక వేషాలు ధరిస్తే అభిమానులు దణ్ణం పెట్టేవారని, నిజంగానే దేవుడి రూపంలా ఎన్‌టిఆర్‌ ఉండేవారని చెప్పారు. 
 
ఎన్టీఆర్ తర్వాత పేదప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడేనన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగానే ఉంటానని చెప్పుకొచ్చారు. తాను అనారోగ్యంతో చనిపోయాయని మీడియాల్లో వార్తలు రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. పైగా, ఇలాంటి వార్తలు రాసేముందు నిజాలు తెలుసుకోవాలని మీడియాకి విజ్ఞప్తి చేశారు.