గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 29 నవంబరు 2016 (18:53 IST)

విజయవాడ 'కంత్రీ' కాంతారావు... లెక్చరర్లను అలా వాడుకున్నాడు... టార్గెట్ 48X2,50,000=రూ.1.2 కోట్లు

సి.ఎల్.కాంతారావు పేరు విజయవాడలో చాలా పాపులర్. ఎందుకంటే ఆయన చేసే వ్యాపారాలు అన్ని ఉంటాయి. డబ్బే డబ్బు అని కూడా చెపుతుంటారు. ప్రధాని మోదీ మోదిన దెబ్బతో కాంతారావు కూడబెట్టిన నల్లడబ్బుతో గిలగిలలాడిపోయారు. ఏం చేయాలన్న దానిపై బాగా ఆలోచించేసరికి ఆయనకు తను క

సి.ఎల్.కాంతారావు పేరు విజయవాడలో చాలా పాపులర్. ఎందుకంటే ఆయన చేసే వ్యాపారాలు అన్ని ఉంటాయి. డబ్బే డబ్బు అని కూడా చెపుతుంటారు. ప్రధాని మోదీ మోదిన దెబ్బతో కాంతారావు కూడబెట్టిన నల్లడబ్బుతో గిలగిలలాడిపోయారు. ఏం చేయాలన్న దానిపై బాగా ఆలోచించేసరికి ఆయనకు తను కరస్పాండెంటుగా ఉన్న గాంధీజి మహిళా కళాశాల కల్పతరువులా కనిపించింది. ఇంకేం... ఆ కాలేజీలో లెక్చరర్లుగా పనిచేస్తున్న 48 మందితో మీటింగు వేసేసి, ఇక నుంచి మీ బ్యాంకు ఖాతాలను పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తమిళనాడు మర్కంటైల్ బ్యాంకుకు మార్చుతున్నట్లు చెప్పేశారు. అంతా ఓకే అన్నారు. 
 
వరసబెట్టి 48 బ్యాంకు ఖాతాలు ఓపెన్ అయ్యాయి. ఐతే ఖాతాలు తెరిచిన దగ్గర్నుంచి ఆ ఖాతాలో పాత నోట్లు జమ చెయ్యడం కొత్త నోట్లు డ్రా చెయ్యడం జరిగిపోతోంది. లెక్చరర్లకు వారివారి ఖాతాల్లో డబ్బు జమ అవుతూ డ్రా చేస్తున్నట్లు బ్యాంకు నుంచి సందేశాలు వస్తున్నాయి. 48 మందిలో ఒక మహిళా లెక్చరర్ అనుమానంతో విషయాన్ని నేరుగా బ్యాంకు వద్ద అడిగింది. వాళ్లు సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. దీనితో నేరుగా ఒన్ టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. అంతే... విషయం గటగటా బయటకు వచ్చేసింది. కరస్పాండెంట్ కాంతారావు కంత్రీ పనులు బయటకు వచ్చాయి. 
 
48 బ్యాంకు ఖాతాలను అడ్డుపెట్టుకుని అందులో నల్లడబ్బును జమ చేసి దాన్ని వైట్ గా మార్చేసుకుంటున్నట్లు తేలింది. ఆయన టార్గెట్ ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2,50,000 అని తెలుస్తోంది. ఆ ప్రకారం డబ్బు జమ చేసి డ్రా చేస్తే మొత్తం కోటీ 20 లక్షలవుతుంది. అలా నల్లడబ్బు అంతా తెల్లడబ్బుగా మారిపోతుంది. అయ్యగారు ప్లాన్ పక్కాగానే వేసారు కానీ పాపం బెడిసికొట్టింది. ప్రస్తుతం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంకా తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు సిబ్బంది, మేనేజర్లను కూడా ప్రశ్నించనున్నారు.