Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య మెడకు రిబ్బన్‌ బిగించి ప్రాణాలు తీశాడు.. ఇంటి వెనుకనే పాతిపెట్టిన భర్త

సోమవారం, 15 మే 2017 (09:51 IST)

Widgets Magazine
murder 1

విజయవాడలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన కసాయి భర్త మృతదేహాన్ని ఇంటి వెనుకనే పాతిపెట్టాడు. విజయవాడ వాంబే కాలనీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కాలనీలో నివసించే తేపల్లి కుమారమ్మ మూడో కుమార్తె మరియమ్మ (30)కు అదేప్రాంతంలో విద్యుత్‌ పనులు నిర్వహించే దుర్గాప్రసాద్‌(35)తో 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవల దుర్గాప్రసాద్‌ స్థానిక రాజీవ్‌నగర్‌లో నివసించే ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరియమ్మ భర్తను నిలదీయడంతో భార్యను భర్త వేధించసాగాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన మరియమ్మ నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వారిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.
 
ఈపరిస్థితుల్లో దుర్గాప్రసాద్‌ భార్యను కలిసి.. ఇక నుంచి బుద్దిగా ఉంటానని, పూర్తిగా మారిపోయానంటూ నమ్మపలికాడు. దీంతో ఇద్దరూ కలిసి రెండు నెలల క్రితం వాంబే కాలనీలో అద్దెకు దిగారు. రెండురోజుల గడిచిన తర్వాత భర్త మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. అదేసమయంలో భార్య అడ్డు తొలగించుకోవాలని దుర్గారావు నిర్ణయించుకున్నాడు. 
 
అదనుచూసి ఒకరోజు మరియమ్మ మెడకు రిబ్బన్‌ బిగించి ప్రాణాలు తీశాడు. అనంతరం ఇంటి వెనుక ఖాళీ స్థలంలో ఐదడుగుల మేర గొయ్యి తవ్వి భార్య మృతదేహాన్ని పాతిపెట్టాడు. మరుసటిరోజు ఉదయం తాపీ కార్మికులను పిలిపించి.. ఆ గోతిపై గట్టు నిర్మించాడు. నాటి నుంచి భార్య వివరాలు అడిగిన ఇరుగుపొరుగుకు ఏవో కారణాలు చెబుతూ వచ్చాడు. 
 
కుమార్తె నెల రోజులుగా కనిపించకపోవడంతో మృతురాలి తల్లి కుమారమ్మ శనివారం ఉదయం అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది. అల్లుడిపై అనుమానంగా ఉందని చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నాన్న కోరిక మేరకే సినిమాల్లోకి వచ్చా : ఆర్కే.రోజా

మా నాన్న కోరిక మేరకే సినిమాల్లోకి వచ్చానని సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ...

news

రోహ్‌టక్‌ రేప్ కేస్.. జననాంగంలో పదునైన వస్తువులు చొప్పించి..

హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ ...

news

పెద్ద నోట్ల రద్దు దెబ్బ కాదు.. వాన్నా క్రై వైరస్ దెబ్బ.. దేశవ్యాప్తంగా ఏటీఎమ్‌ల మూసివేత

పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఇప్పటికీ దేశంలో 60 నుంచి 75 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. ఇప్పుడు ...

news

ఇక ఎమ్మెల్యేలు.. ఎంపీలకు చంద్రబాబు పదవులు ఇవ్వనన్నారు... ఎంపీ మురళీమోహన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ...

Widgets Magazine