గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (10:02 IST)

విజయవాడ తాత్కాలిక రాజధానే.. శాశ్వతం కాదు..: కేఈ కృష్ణమూర్తి

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ తాత్కాలిక రాజధాని మాత్రమేనని, శాశ్వతం కాదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అలాగే, సహచర మంత్రి పి నారాయణ రాజధాని విజయవాడేనంటూ పదేపదే ప్రకటనలు చేయడం వల్లే ఈ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ విజయవాడ తాత్కాలిక రాజధాని అని, కొంతకాలం తర్వాత విజయవాడ పూర్తి స్థాయి రాజధాని అవ్వొచ్చు, కాకపోవచ్చన్నారు. అక్కడ భూముల ధరలు పెరిగితే వేరే చోటుకు తరలిపోయే అవకాశం ఉందన్నారు. విజయవాడ చాలా ఇరుకైన నగరమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని తాను అనలేదని చెప్పారు. విజయవాడలో ప్రభుత్వ భూములు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయని, మొత్తం 500 ఎకరాలలోపే భూమి అందుబాటులో ఉందన్నారు. కర్నూలుకు 10 కిలోమీటర్ల పరిధిలో 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఇతర ఏ జిల్లా కేంద్రంలోనూ ఇంత భూమి అందుబాటులో లేదని ఆయన తెలిపారు.