శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (16:23 IST)

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్రం సానుకూలం... పీఎంవో ఆదేశాలు

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రైల్వేశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై రైల్వేశాఖ సాంకేతిక కమిటీ సమావేశమైంది.
 
లోగడ మిట్టల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జోన్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి రైల్వేజోన్‌ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. అదేవిధంగా కాకినాడ - కోటిపల్లి - నరసాపురం రైల్వేలైన్‌కు కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. 
 
కాగా, రాష్ట్ర విభజన హామీల్లో విశాఖ రైల్వే జోన్ కూడా ఉన్న విషయం తెల్సిందే. ఈ జోన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా, రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. వీరి కృషి ఫలితంగా కేంద్రంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది.