Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'గలీజు పోలీస్'.. యువతిపై లైంగికదాడి ... వీడియోతో 'బెండు'తీసింది

గురువారం, 4 జనవరి 2018 (14:53 IST)

Widgets Magazine
ci bendi

'గజల్' శ్రీనివాస్ లైంగిక వేధింపుల వ్యవహారం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో పెను చర్చనీయాంశంగా మారింది. ఇంతలో మరో గలీజు ఖాకీ నిర్వాకం వెలుగు చూసింది. హోటల్ గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగికదాడికి యత్నించిన ఖాకీకి ఆ యువతే తగిన విధంగా గుణపాఠం చెప్పింది. విశాఖపట్టణంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసికి చెందిన ఓ యువకుడు నగరంలోని ఫోర్‌పాయింట్స్‌ హోటల్‌లో పనిచేస్తున్నాడు. మలేషియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతి మలేషియాలో తన ఉద్యోగం వదిలేసి కొద్దినెలల కిందట అదే హోటల్లో పనికి చేరింది. ఏం జరిగిందో ఏమోగానీ ఆ యువతికి చెప్పాపెట్టకుండా పారిపోయాడు. 
 
దీనిపై ఆ యువతి గత యేడాది నవంబర్‌ 18వ తేదీన త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ త్రీ టౌన్‌ సర్కిల్‌ బెండి వెంకటరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, పారిపోయిన యువకుడిని అదుపులోకి తీసుకున్నాడు. పంజాబ్‌లోని లుథియానా కోర్టులో హాజరుపరిచిన తర్వాత నగరానికి తీసుకువచ్చి జైలుకు తరలించారు. 
 
అయితే సదరు యువతి తన ప్రియుడిని జైలుకు పంపిస్తే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడేమోనని సీఐ వెంకటరావు వద్ద తన ఆందోళనను వెలిబుచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న సీఐ వెంకటరావు ఈ నెల 28న ఆమె ఉంటోన్న మరో హోటల్‌ గదికి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. 
 
దీంతో ఆమె తెలివిగా వీడియో, ఫొటోలు తీసి నగర సీపీకి మంగళవారం ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో సీఐ వెంకటరావును సస్పెండ్‌ చేస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దట్టమైన పొగమంచు.. చుట్టూ జనాలు... యువతిపై అత్యాచారం

దట్టంగా అలముకున్న పొగమంచులో యువతిపై అత్యాచారం జరిగింది. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ పొగమంచు ...

news

కర్నూలు కొత్త బస్టాండు వద్ద వ్యభిచారం.. జైలుశిక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న కొత్త బస్టాండు వద్ద విచ్చలవిడిగా ...

news

బీజేపీకి షాకిచ్చిన టీడీపీ ఎంపీలు ... 'ట్రిపుల్ తలాక్' బిల్లుకు చుక్కెదురు

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న అధికార తెలుగుదేశం ...

news

చార్మినార్ ముందు చిన్న చెత్త కాగితాన్ని ఇక మీరు చూడలేరంతే...

హైదరాబాద్ పేరు వింటేనే మనకు గుర్తుకు వచ్చేది చార్మినార్. హైదరాబాద్ సందర్శనకు వచ్చిన ప్రతి ...

Widgets Magazine