మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (16:35 IST)

ఆఖరి పోరాటం : వర్శిటీ కోసం దేశం నాయకులు చక్కర్లు

విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడానికి అనువైన భూమిని చూపించలేదని కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ఫైలును తిప్పిపంపడంతో తెలుగుదేశం నాయకులు గుటికలు మింగుతున్నారు. ఎలాగైనా విశ్వవిద్యాలయాన్ని దక్కించుకోవడానికి ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి మృణాళిని నేతృత్వంలో తెలుగుదేశం ఎంపిలు ఖాళీ భూములు పట్టుకుని తిరుగుతున్నారు. 
 
ఎట్టి పరిస్థితులలోనూ జిల్లా నుంచి విశ్వవిద్యాలయం తరలిపోకుండా ఉండేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడును కలసి పరిస్థితిని వివరించారు. అనువైన భూమిని గుర్తించాలని మంత్రి మృణాళిని ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. కేంద్ర మానవ వనరుల శాఖ తిరస్కరించిన తరువాత కొత్త ప్రతిపాదనలు తయారు చేయడానికి పరుగులు పెడుతున్నారు. 
 
జిల్లాలోని పాచిపెంట్లలో పెద్దగా అనువైన భూములన్నాయని భావిస్తున్నారు. విజయనగరం సెగ్మెంటులో 750 ఎకరాలు, నెల్లిమర్ల లో 1400 ఎకరాలు, కొత్త వలస మండలంలో 1600 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. నివేదిక తయారు చేసి మరోమారు కేంద్రంతో చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం శాసనసభ్యులు ప్రయత్నిస్తున్నారు.