గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (14:41 IST)

ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డుకు, ఆధార్ కార్డు నంబరును అనుసంధానం చేయనున్నారు. నకిలీ ఓటరు కార్డుల ఏరివేత చర్యల్లో భాగంగా ఈ అనుసంధాన ప్రక్రియను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ఆధార్ కార్డులను జారీ చేయడం జరిగింది.
 
పారదర్శక ఓటర్ల జాబితా తయారీ కోసం జాతీయ ఎన్నికల కమిషన్‌ చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆధార్‌ సంఖ్యను సమర్పించాలని ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఎన్నికల సంఘం కోరింది. ఏ
 
ప్రిల్‌ 1వ తేదీ నుంచి బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వో) ఇంటింటికీ వెళ్లి ఆధార్‌ వివరాలను తెలుసుకుంటారని వివరించింది. ఈ లోగా ఓటర్లు తమ ఆధార్‌ కార్డు జీరాక్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. దీంతో పాటు ఆన్‌లైన్‌, మొబైల్‌ ద్వారా కూడా ఆధార్‌ సంఖ్యను ఓటరు కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చని వివరించింది.