శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (14:31 IST)

వేటుపై లేటెందుకు : వైసీపీ కౌన్సిలర్లపై అనర్హత వేటెప్పుడు?

ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సమయంలో విప్ ధిక్కరించిన ఎనిమిది మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై అనర్హత వేటు వేసేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల దెబ్బకు భయపడి వేటుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.
 
యర్రగుంట్ల మున్సిపాలిటీలో 18మంది కౌన్సిలర్ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. కేవలం 2 స్థానాలు మాత్రమే టీడీపీ దక్కించుకుంది. అధికారం అండతో 8 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను స్థానిక ‘దేశం’ నేతలు ప్రలోభాలకు గురిచేశారు. 
 
దాంతో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన కౌన్సిలర్లు పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఆ మేరకు ఛెర్మైన్, వైస్ ఛెర్మైన్ ఎన్నికలకు లాటరీ అనివార్యమైంది. కాగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు విప్ ధిక్కరించడంతో ఆ పార్టీ నేతలు రిటర్నింగ్ అధికారి రంగన్నకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నోటీసులు సైతం జారీ చేశారు. అయితే చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు.