శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (15:25 IST)

పవన్... చంద్రబాబు చెప్పింది చేస్తారా? జగన్‌కు ఎందుకు మద్దతివ్వలేదు?

పవన్ కల్యాణ్.. అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవర్ స్టార్‌దే హవా. అటు సినీ రంగంలోనైనా సరే.. రాజకీయాల్లో నైనా సరే. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత తనకొచ్చిన క్రేజ్‌ను సద్వినియోగం చేసుకున్న పవన్ కల్యాణ్ రాష్ట్ర తలరాతనే మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించకుండా టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సపోర్ట్ చేశారు. 
 
అలాగే కేసీఆర్‌ను కూడా హెచ్చరించారు. రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేస్తే అంతేసంగతులని వార్నింగ్ ఇచ్చారు. అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒకప్పుడు హైదరాబాద్‌ని డెవలప్ చేసిన చంద్రబాబుకు మద్దతిచ్చేశారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు రుణమాఫీపై ఖచ్చితమైన వివరం చెప్పకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు రావడంతో.. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో తెలియదు కానీ.. బాబుకు పవన్ సపోర్ట్‌పై రాజకీయపండితులు తమ అభిప్రాయాలను వెళ్లగక్కుతున్నారు. 
 
చంద్రబాబు చెప్పింది చేస్తారా? లేకుంటే అధికారం కోసం హామీలిచ్చేసి కమిటీల పేరిట కాలయాపన చేస్తారా? అనుకుంటున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు హామీలను ఎండగడుతున్న జగన్ ఎందుకు అధికారంలోకి రాలేదు..? రుణ మాఫీలు సాధ్యం కాదా? అందుకే జగన్ రైతు రుణమాఫీలపై హామీలివ్వకుండా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారా అంటూ యోచిస్తున్నారు. రుణమాఫీ అంత సుళువు కాదని జగన్ చేస్తున్న వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానం చూస్తుంటే అదే నిజమనిపించేలా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. 
 
ఇంకా హామీలు నిలబెట్టేందుకు కమిటీల పేర్లు చెప్పుకుంటున్న చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సపోర్ట్ చేయడం ద్వారా పవర్ స్టార్ పేరు చెడిపోతుందా.. ఒకవేళ జగన్‌కు పవన్‌ సపోర్ట్ చేసివుంటే జగన్ మాత్రం హామీలను నెరవేర్చేవారా అని పవర్ అభిమానులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా.. ఎన్నికల్లో గెలిచేందుకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్.. హామీలను నెరవేర్చకపోతే మెదలకుండా ఉండిపోకూడదని.. ఒకవేళ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు నెరవేర్చకపోతే.. పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.