శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 8 జులై 2017 (14:29 IST)

బోరున ఏడ్చిన వైఎస్. జగన్ .. ఎందుకు?

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోటచేరారు. వైఎస్ఆర్ జయంతి కావడంతో కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్న వై.ఎస్.జగన్, షర్మిళలు వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోటచేరారు. వైఎస్ఆర్ జయంతి కావడంతో కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్న వై.ఎస్.జగన్, షర్మిళలు వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. వై.ఎస్.జగన్ వెంట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. గంటకుపైగా వై.ఎస్. సమాధి వద్దే కుటుంబ సభ్యులు కూర్చుండిపోయారు. జగన్ కంట తడి పెట్టారు. ఆయన్ను షర్మిళ ఓదార్చే ప్రయత్నం చేశారు.
 
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి కొడుకు జగన్ అంటే చాలా ఇష్టం. జగన్‌కు తండ్రి అంటే ఇంకా ఇష్టం. వై.ఎస్. బతికున్న సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే జగన్‌తో ఎక్కువ సేపు గడిపి వెళ్ళేవారు. అలాంటి వ్యక్తి దూరమైన తర్వాత జగన్ మానసికంగా కృంగిపోయారు. వై.ఎస్. మరణించి చాలా సంవత్సరాలవుతున్నా జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తండ్రిని గుర్తు తెచ్చుకుని జగన్ బోరున విలపించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.