భర్తను పిజ్జా కొనివ్వమంది.. పెళ్లైన రెండో రోజే చెక్కేసింది..

గురువారం, 12 అక్టోబరు 2017 (09:49 IST)

pizza

భర్తను పిజ్జా కొనివ్వమని అడిగింది.. షాపులోంచి బయటకొచ్చేసిరికి చెక్కేసింది. పెళ్లైన మరునాడే భర్తకు ఝలక్ ఇచ్చింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా కీసర మండలం ఆర్‌ఎల్‌ నగర్‌‌లో పాలవ్యాపారి మాదినేని తిరుపతయ్య (23)తో కడప జిల్లా మైదుకూరుకు చెందిన రాజపుత్ర శివమల్లేశ్వరి (19)కి ఈ నెల ఒకటో తేదీన పెద్దలు వివాహం చేయించారు. 
 
వివాహం జరిగిన వెంటనే ఆమెను తిరుపతయ్య హైదరబాదుకు తీసుకొచ్చాడు. మరుసటి రోజు సినిమాకు తీసుకెళ్లమని భార్య కోరడంతో సరేనని తీసుకెళ్లాడు. సినిమా పూర్తయిన తర్వాత పిజ్జా కావాలని కోరింది. దీంతో భార్య షాప్ బయట ఉంచి.. పిజ్జా తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఆమె ఓ ఆటోలో వెళ్లిపోతుండటం కనిపించింది. దీంతో ఆమె కోసం గాలింపు చేపట్టాడు. దొరకకపోయేసరికి తిరుపతయ్య కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జై షాను వెనుకేసుకొస్తున్నారంటే తప్పు జరిగినట్టే : యశ్వంత్ సిన్హా

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ ...

news

నిబద్ధత కలిగిన బార్బర్ ఏం చేశాడో చూడండి... (Video)

మనం చేసే పనిపై శ్రద్ధతోపాటు ఎంతో నిబద్ధత ఉండాలని పెద్దలు చెపుతుంటారు. అపుడే చేసే పనిలో ...

news

స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కింద 6 నెలల్లో 20 లక్షల మరుగుదొడ్లు నిర్మాణం

అమరావతి: రాష్ట్రంలో స్వఛ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఆరు ...

news

8 జాతీయ, అంతర్జాతీయ స్కూళ్లకు 32 ఎకరాలు... మంత్రి నారాయణ

అమరావతి : అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 జాతీయ, అంతర్జాతీయ పాఠశాలలకు రాష్ట్ర ...