Widgets Magazine

భక్తి పేరుతో గుడికి... పెళ్లయిన 3 నెలలకే భర్తను హతమార్చిన భార్య

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (06:39 IST)

Widgets Magazine
jayalakshmi

వివాహేతర సంబంధాలు ఎంతటి దురాగతాలకైనా పాల్పడేలా చేస్తాయి. ఓ వివాహిత పెళ్లయిన మూడు నెలలకే కట్టుకున్న భర్తను తన ప్రియుడితో కలిసి కడతేర్చింది. పెళ్లికి ముందు నుంచి తన ప్రియుడితో ఉన్న వివాహేతర సంబంధం ఎక్కడ భర్తకు తెలిసిపోతుందన్న భయంతోపాటు వివాహమైన తర్వాత ప్రియుడితో ఏకాంతంగా గడపలేక పోతున్నానని భావించి భర్త అడ్డు తొలగించుకుంది. ఈ దారుణం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరానికి, ద్రాక్షారామానికి చెందిన జయలక్ష్మి అనే యువతీ యువకుడికి ఈ యేడాది మేలో వివాహమైంది. జయలక్ష్మి ద్రాక్షారామంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. అయితే, అదే ఆసుపత్రిలో పనిచేసే సహోద్యోగి వీరేష్‌తో ఈమెకు పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో పెళ్లి కావడంతో వీరేష్‌తో కాస్త ఎడబాటు వచ్చింది. ఏకాంతంగా గడపలేకపోతూ వచ్చింది. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ చేసింది. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా, గత నెల 29వ తేదీన భర్తను భక్తి పేరుతో గౌరీపట్నంలోని నిర్మలగిరికి తీసుకెళ్లింది. వీరిద్దరిని జయలక్ష్మీ ప్రియుడు వీరేష్‌ ఫాలో అయ్యాడు. ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం, మొదట భర్త చేత గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేయించింది. దీంతో భీమశంకరం తనకు నీరసంగా ఉందని చెప్పారు. ఇదే ఛాన్స్‌గా భావించిన కిలాడీ లేడీ కపట ప్రేమను వలకబోస్తూ నీరసం పోవడానికి అంటూ ఓ హైపవర్‌ డ్రగ్‌ను ఇంజెక్షన్‌‌ను చేసింది. అంతే, కొద్దిసేపటికే అతను మృతి చెందాడు. ఆ తర్వాత అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో గతనెల 29న దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దీనిపై లోతుగా దర్యాప్తు చేయగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరంగా గుర్తించారు. 
 
ఇక, తీగ లాగితే వివాహేతర సంబంధమే ఈ మర్డర్‌కు కారణమని తేలింది. దీంతో భార్య జయలక్ష్మిని అదుపులోకీ తీసుకున్న పోలీసులు... తమ స్టైల్‌లో విచారించగా, అసలు గుట్టు రట్టయ్యింది. అమ్మగారి ప్రేమాయణం. ప్రియుడితో కలిసి వేసిన ప్లాన్లులు. కట్టుకున్న భర్తను కడతేర్చిన విధానం అంతా పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు జయలక్ష్మీతో పాటు ఆమెకు సహకరించిన వీరేష్‌ను కూడా అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యేడాదికి ముందే సత్తా చూపిద్దాం... కేసీఆర్ వ్యూహం... గుత్తాతో రాజీనామా?

సార్వత్రిక ఎన్నికలకు ఒక యేడాది ముందు తమ సత్తా చాటేందుకు తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు ...

news

తెరాస వద్దంది.. బీజేపీ రమ్మంది... అందుకే కాంగ్రెస్‌కు గుడ్‌బై..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అత్యంత కీలక నేతల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరు. ...

news

పర్యాటక అవార్డులు, రివార్డులు ఆంధ్రప్రదేశ్‌కు సొంతం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. పర్యాటక అనుకూల ...

news

ఆయనే కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం... కోమటిరెడ్డి

తెలంగాణలో తెలంగాణ పీసీసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే 2019 ఎన్నికల్లో ...