Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నెల్లూరులో సినిమాకెళ్లారు... భార్య టాయిలెట్‌కెళ్లి తిరిగి రాలేదు...

శనివారం, 4 నవంబరు 2017 (16:00 IST)

Widgets Magazine
Ladies

ఈమధ్య సినిమాకెళ్లడం కూడా డేంజరే అన్నట్లుగా వుంది. అతడు చక్కగా తన భార్యను తీసుకుని సినిమాకు వెళ్లాడు. సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఎంతసేపటికీ తిరిగిరాలేదు. వివరాలను చూస్తే... నెల్లూరు జిల్లా టీడీ గూడూరు మండలం వరిగొండకు చెందిన హరిత లక్ష్మి, పోలంరెడ్డి అవినాష్‌ రెడ్డి దంపతులు గత అక్టోబరు నెల 31వ తేదీన నెల్లూరులోని ఎస్‌-2 సినిమా థియేటర్‌కు సినిమా చూసేందుకు వచ్చారు. 
 
సినిమా జరుగుతుండగా భార్య తను టాయిలెట్ కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఆ తర్వాత ఎంతకీ రాలేదు. దీంతో అనుమానం వచ్చిన అవినాష్ అక్కడికెళ్లి వెతికాడు. ఆ ప్రాంతమంతా గాలించినా ఆమె ఆచూకి తెలియరాలేదు. దీనితో తన స్నేహితులు, బంధువుల ఇళ్లకేమైనా వెళ్లిందేమోనని ఫోన్లు చేశాడు. కానీ ఎక్కడా ఆమె ఆచూకి లభ్యం కాలేదు. దీనితో నెల్లూరు వన్ టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుమల ఆలయ డిక్లరేషన్ పైన సంతకం చేయని జగన్ (వీడియో)

ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తిరుమల ఆలయ నిబంధనలను పట్టించుకోలేదు. ఆలయ నిబంధనల ప్రకారం ...

news

25 ఏళ్లలో ఒకే ఒక్కడు ట్రంప్... ఎవరాయన?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏ పని చేసినా అది చర్చనీయాంశమే. ఏ నిర్ణయం తీసుకున్నా ...

news

యుద్ధానికి సిద్ధం కండి : చైనా ఆర్మీకి జిన్‌పింగ్ ఆదేశం

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ యుద్ధానికి పిలుపునిచ్చారు. ఒకవైపు ఉత్తర కొరియా వరుస ...

news

జగన్‌కు షాక్.. సైకిలెక్కిన రంపచోడవరం వైకాపా ఎమ్మెల్యే

ఈనెల ఆరో తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ ...