గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 మార్చి 2017 (04:23 IST)

జగన్ కంచుకోటలో టీడీపీ పాగా వేసేనా? నేడే స్థానిక ఫలితాలు

దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా టీడీపీ ప్రాభవంలోకి వెళ్లనుందా.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రానున్నాయన్న వార్తల నేపథ్యంలో జగన్ కంచుకోట బద్దలు కానుందని భావిస్తున్నారు. ఒకరంకంగా చెప్పాలంటే కడప

దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా టీడీపీ ప్రాభవంలోకి వెళ్లనుందా.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రానున్నాయన్న వార్తల నేపథ్యంలో జగన్ కంచుకోట బద్దలు కానుందని భావిస్తున్నారు. ఒకరంకంగా చెప్పాలంటే కడపలో ఇప్పుడు పరువు ప్రతిష్టల పోరాటం మొదలైంది. మరి కొన్ని గంటల్లో ఈ చిక్కుముడి వీడనుంది.
 
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీ నేతల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలు విడుదల కాబోతుండడంతో కడప జిల్లాలోని వైసీపీ, టీడీపీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరాలు తెగే ఉత్కంఠ రేపింది కడప జిల్లా రాజకీయం. జగన్ కడపలోనే మకాం వేసి బాబయ్ గెలుపు కోసం అనేక ప్రయత్నాలు చేశారు. టీడీపీ కూడా సీనియర్ నేతలను రంగంలోకి దింపింది. 
 
ఈ ఎన్నికల్లో గెలుపెవరదీ అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రెండు పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి. టీడీపీ సంఖ్యా బలం మీద ఆశపెట్టుకుంటే, వైసీపీ క్రాస్ ఓటింగ్‌ను నమ్ముకుంది. టీడీపీ సంఖ్యా బలం ఉంటే మాకు దేవుడు ఉన్నాడంటూ చివరకు న్యాయమే గెలుస్తుందని జగన్ వాపోయారు. కౌంటింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్ది రెండు పార్టీల్లో టెన్షన్ మొదలైంది. క్రాస్ ఓటింగ్ జరిగిందా.. ఓటు వేస్తామన్న వారు వేశారా లేదా అన్నదానిపై నేతల్లో గుబులు మొదలైంది.
 
జిల్లాలోని పది నియోజకవర్గాల పరిదిలో మొత్తం 841 ఓట్లులున్నాయి. ఇందులో 445పైగా ఓటర్లు టీడీపీ శిబిరంలో ఉన్నారని ఆ పార్టీ తేల్చింది. జగన్ శిభిరంలో 390 ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్న మాట. టీడీపీ శిబిరంలో ఉన్నవారు చాలా మంది తమకు ఓటు వేస్తారని వైసీపీ నేతలు ప్రకటించడంతో క్రాస్ ఓటింగ్‌ను కట్టడి చేసేందుకు పోలీంగ్ సమయంలో కోడ్ విధానం పెట్టింది టీడీపీ. ఇందులో ఎవరు సక్సెస్ అయ్యారన్నది కాసేపట్లో తేలనుంది. 
 
గతంలో కడపలో ఏ ఎన్నికలు వచ్చినా వైయస్ కుటుంబానికే ఏకపక్షంగా ఉంటాయని ఎవ్వరైనా ఠకీమని చెప్పేవారు. అయతే ఈ ఎన్నికల్లో సీన్ మారే విధంగా టీడీపీ తన సత్తా చేపించి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చింది. ఎవరు గెలిచినా మోజార్టీ 10 నుంచి 20 వరకు ఉంటుందని అంటున్నారు. వైసీపీ ఓడిపోతే 40 ఏళ్లలో వైయస్ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలినట్టే.