Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనంతలో బీహార్ ఆటవిక చర్య : మంచినీటి తొట్టె వద్దన్నందుకు మహిళను చితక్కొట్టారు

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:34 IST)

Widgets Magazine
tdp cadre attak on woman

గతంలో బీహార్ రాష్ట్రంలో ఎక్కువగా ఆటవిక చర్యలు జరుగుతుండేవి. ఇలాంటి ఆటవిక చర్యలు ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ చర్యకు పాల్పడింది ఏకంగా అధికార టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ కావడం గమనార్హం. తన పొలంలో పశువుల కోసం మంచినీటి తొట్టెను నిర్మించవద్దని గట్టిగా చెప్పిన పాపానికి ఓ మహిళను గ్రామ సర్పంచ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు కలిసి చితక్కొట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
అనంతపురం జిల్లా, కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో పశువులకు తాగునీటి కోసం ఓ తొట్టిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తొట్టెను సుధ అనే మహిళ స్థలంలో నిర్మించాలని సర్పంచ్ నాగరాజు తీర్మానం చేశారు. అయితే ఆ నిర్ణయాన్ని సుధ వ్యతిరేకించింది. తన స్థలంలో తొట్టె నిర్మించడానికి ఒప్పుకోనని ఆమె స్పష్టం చేసింది.
 
దీంతో సర్పంచ్ నాగరాజు, చంద్ర అనే మరో వ్యక్తి ఆమెను చితకబాదారు. కాళ్లతో తన్ని, జుట్టుపీకి తీవ్రస్థాయిలో దాడి చేశారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు. సుధపై దాడి జరుగుతున్నప్పుడు గ్రామస్తులు తీసిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో అప్‌లోడ్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. 
 
సర్పంచ్ స్వయంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని మహిళను కొడుతున్నా ఎవరూ అడ్డుకోలేదు. ఇదేంటన్ని ప్రశ్నించలేదు. పైగా అందరూ చట్టూ చేరి వేడుకగా చూశారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. దాడి తర్వాత తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఈ అంశం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అయితే, ఈ దాడికి తెగబడింది స్థానిక టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ అనుచరులుగా భావిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చెవి రంధ్రంలో దూరిన పైతాన్.. ఫేస్‌బుక్‌లో సెల్ఫీ.. షేర్లు, లైక్స్ వెల్లువ

చెవి రంధ్రంలో పైతాన్ అదే.. కొండచిలువ దూరింది. ఇదేంటి? కొండ చిలువ చెవిపోగులు ధరించే ...

news

సీఎం కేసీఆర్ జీతం చూస్తే కళ్ళు తిరగాల్సిందే.. జయలలిత ఒక్కరూపాయి తీసుకునేవారు!

దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ సీఎం కేసీఆర్ జీతమే టాప్. ఇంతకీ ఆయన జీతం ఎంతో ...

news

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా రహదారులు రక్తమోడాయి. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ...

news

తిరుపతికి మొండిచేయి చూపించిన విత్తమంత్రి అరుణ్ జైట్లీ

ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల. ప్రతిరోజు 50 నుంచి 70వేల మందికిపైగా భక్తులు తిరుపతికి ...

Widgets Magazine