శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 జులై 2015 (12:44 IST)

గోదావరి పుష్కరాలు: ఘాట్ వద్ద పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

గోదావరి పుష్కరాల కోసం వచ్చిన ఓ నిండు గర్భిణీ పండంటి బిడ్డను ప్రసవించింది. పుష్కరాల సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. 144 ఏళ్లకోసారి జరిగే మహా పుష్కరాల్లో పుణ్యస్నానమాచరిస్తే శుభం కలుగుతుందనే భావనతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 
 
తీవ్ర అనారోగ్య సమస్యలున్నా, ఎలాగోలా పుష్కర స్నానం చేయాల్సిందేనన్న గట్టి సంకల్పం వారిని పుష్కర ఘాట్ల వద్దకు తీసుకొస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్‌కు మంగళవారం ఉదయం ఓ నిండు గర్భిణీ ఇదే భావనతో పుష్కర స్నానం కోసం వచ్చేసింది. 
 
అయితే ఘాట్‌లోనే పురిటి నొప్పులు వచ్చిన ఆమె అక్కడే పండంటి బిడ్డను ప్రసవించింది. ప్రసవానంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అక్కడి వైద్య సిబ్బంది తెలిపారు. ప్రసవానంతరం ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. ఓటుకు నోటు కేసులో అరెస్టై బెయిలుపై వున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఏసీబీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పవిత్ర గోదావరి పుష్కరాల్లో పుణ్య స్నానమాచరించేందుకు తనకు అనుమతివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయితే కోర్టు ఈ పిటీషన్‌ను పరిశీలనకు తీసుకుంటూనే, విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.