Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"రియల్ శివగామి"... బిడ్డ ప్రాణానికి తన ప్రాణం అడ్డేసిన తల్లి

గురువారం, 18 జనవరి 2018 (10:41 IST)

Widgets Magazine
gauri

ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షక మహాశయుల నీరాజనాలు అందుకుంది. ఈ చిత్రంలో శివగామి పాత్రను నటి రమ్యకృష్ణ పోషించింది. ఇందులో అమరేంద్ర బాహుబలి కోసం శివగామి తన ప్రాణాలను అడ్డేస్తుంది. అంటే శివగామి నీట మునిగి ప్రాణాలు కోల్పోయినా, శిశువును మాత్రం ఒంటిచేత్తో పైకి ఎత్తిపట్టుకుని ప్రాణాలు కాపాడుతుంది. ఇదే తరహా విషాదకర ఘటన ఒకటి ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖలోని సబ్బవరం మండలం పైడివాడ గ్రామానికి చెందిన బండ శ్రీను (25), గౌరి (25) అనే దంపతులు ఉన్నారు. వీరికి కుశాలవర్ధన్‌ (4), హేమరఘురాం (2) అనే ఇద్దరు పిల్లలు. సంక్రాంతి పండగ కోసం మూడు రోజుల కిందట పెందుర్తి మండలం గండిగుండంలోని అత్తారింటికి ఈ దంపతులు తమ పిల్లలతో కలిసి వెళ్లారు. పండగ ముగించుకుని బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు.
 
మార్గమధ్యంలో సబ్బవరం శివారు చిన్నయ్యపాలెం టెర్రాకాన్‌ లేఅవుట్‌ వద్ద వస్తుండగా, వెనుకనే ఆర్టీసీ బస్సు వస్తోంది. ఆ బస్సుకు ఎదురుగా లారీ వచ్చింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీను, బైక్‌పై ముందు కూర్చున్న కుశాలవర్ధన్‌ తూలి రోడ్డుపక్కనే ఉన్న పొదల్లో పడిపోయాడు. వెనుక కూర్చొన్న గౌరీ, హేమరఘురాంలు రోడ్డుపై పడిపోయారు. 
 
అయితే, ఆ వెనుకనే ఆర్టీసీ బస్సు తన వైపు దూసుకురావడాన్ని హేమ గమనించి... ఒడిలోని బాబును రెండు చేతులతో పట్టుకుని క్షణాల్లో రోడ్డుపక్కనే ఉన్న తుప్పల్లోకి విసిరేసింది. ఆ వెంటనే రెప్పపాటులో బస్సు వెనుక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లడంతో గౌరి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు తెప్పించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Vizag Woman Kill Road Accident

Loading comments ...

తెలుగు వార్తలు

news

మేమిద్దరం నవ యువకులం : నెతన్యాహు

భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ...

news

ఓ మైగాడ్... ఒక్క క్షణం ఆలస్యమైతే? (వీడియో)

చాలామంది ప్రాణాలు పోగొట్టుకునేంతగా సాహసాలు చేస్తుంటారు. తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి ...

news

'అన్న' ఎన్టీఆర్‌లా నేను కూడా... రజినీకాంత్ సంచలనం....

తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 8 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న నటుడు ...

news

“ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి: చంద్రబాబు

న్యూ ఢిల్లీ : “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా వుందని, ...

Widgets Magazine