Widgets Magazine

దేవాలయంలోనే అత్యాచారం.. కత్తులతో దాడి.. సజీవదహనం.. ఎక్కడ?

శనివారం, 11 ఆగస్టు 2018 (15:57 IST)

దేవాలయంలోనే ఘోరం జరిగింది. 25ఏళ్ల మహిళపై ఆలయంలోనే కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. యువతిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా అత్యంత కిరాతకంగా కత్తులతో దాడిచేసి, ఆ తర్వాత సజీవంగా దహనం చేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
gang rape
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని మనుబోలు సమీపంలో వెంకయ్య స్వామి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కాలిపోయిన స్థితిలో వున్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్వాడ్ లతో ఆధారాలను సేకరించారు. ఇలా సేకరించిన ఆధారాలతో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు, ఈ హత్య ఎలా జరిగిందో వివరించారు. 
 
బాధితురాలిని వెంకయ్య స్వామి గుడి వద్దకు తీసుకువచ్చిన నిందితులు మొదట మద్యం సేవించి, ఆ తర్వాత గుడి పరిసరాల్లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని పోలీసులు చెప్పారు. ఆపై కత్తులతో దాడి చేయగా, ఆమె పారిపోయేందుకు యత్నించి వుంటుందని.. దీంతో ఆమెను సజీవదహనం చేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
దేవాలయం అత్యాచారం పోలీసులు నెల్లూరు Manubolu Woman Rape Temple Nellore

Loading comments ...

తెలుగు వార్తలు

news

మొన్న మేక.. నేడు ఆవు.. కామాంధుడి అసహజ లైంగిక చర్య..

మొన్నటికి మొన్న మేకపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ప్రస్తుతం ఆవును కూడా ...

news

బిగ్ బాస్ హౌస్‌ టాస్క్‌లు.. మగాళ్లతో ఆడవాళ్లకు ఫిజికల్‌ గేమ్‌లా?

బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. ఈ వారం కెప్టెన్సీ కోసం బిగ్ ...

news

పెళ్లి పేరిట మైనర్ బాలిక మోసం.. లోబరుచుకుని గర్భవతిని చేశాడు.. శీలం ధర రూ.2.5 లక్షలు

పెళ్లి పేరిట మోసం చేశాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆ బాలిక గర్భం ...

news

గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి వచ్చేస్తారా? తలసాని ఎద్దేవా

కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస్ ...

Widgets Magazine