శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 17 ఆగస్టు 2014 (11:25 IST)

సింగరాయకొండలో దారుణం ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు!

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతకుడు తన ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసి, అర్థరాత్రే శవాన్ని మాయం చేసే క్రమంలో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే... సింగరాయకొండ పట్టణంలో శనివారం అర్థరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ వాహనాన్ని ఆపారు. ఆ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులకు అందులో ఓ యువతి మృతదేహం కనిపించింది. 
 
డ్రైవర్ స్థానంలో ఉన్న యువకుడిని ప్రశ్నించగా, అతడు పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని తమదైన శైలిలో ప్రశ్నించగా, అసలు విషయం వెలుగు చూసింది. నేరాన్ని ఒప్పుకున్న అతడిని వాహనంతో సహా స్టేషన్ కు తరలించిన పోలీసులు, అసలు విషయాన్ని రాబట్టే పనిలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.