మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (11:08 IST)

వెట్టి చాకిరీ చేయించుకున్న సంస్థకు జరిమానా!

భారతీయ నిపుణులతో వెట్టి చాకిరీ చేయించుకుని అతి తక్కువ వేతనాలిచ్చిన ఓ అమెరికా కంపెనీకి జరిమానా విధించారు. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ప్రింటింగ్ రంగంలో పేరుగాంచిన ‘ఎలక్ట్రానిక్స్ ఫర్ ఇమేజింగ్ ఇన్ కార్పొరేటెడ్’ సంస్థ భారతీయుల శ్రమను దోచుకుంది. ఇందుకుగాను రూ.25,80,000లను భారతీయ నిపుణులకు పెనాల్టీగా చెల్లించాలని ఆ సంస్థకు అమెరికా కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
గతేడాది 728 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన ఆ సంస్థ భారతీయ నిపుణులతో మితిమీరిన స్థాయిలో పనిచేయించుకుని, వారికి తగిన మేర వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగుల వేతనాల చెల్లింపు విషయంలో సదరు సంస్థ నిబంధనలను అతిక్రమించిందని కూడా అమెరికా కార్మిక శాఖ తేల్చింది.
 
కంపెనీ పురోగతి కోసం వారానికి 122 గంటల పాటు పనిచేసిన ఎనిమిదిమంది భారత నిపుణులు గంటకు కేవలం 1.21 డాలర్లను మాత్రమే అందుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది.