గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (14:56 IST)

అంకెలతో ఆశలు చూపిన యనమల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకల్లో పరిశీలిస్తే కింది విధంగా ఉంది. శాఖలవారీ కేటాయింపులు ఇలా ఉన్నాయి. రూ.1,11, 824 కోట్లతో బడ్జెట్‌ను రూపకల్పన చేసిన యనమల... ప్రణాళికేతర వ్యయం కింద రూ.85,151 కోట్లు చూపించారు. అలాగే, రూ.26 వేల కోట్ల ప్రణాళికా వ్యయం కాగా, రెవెన్యూ లోటు రూ.6,064 కోట్లుగా చూపారు. ఆర్థిక లోటు రూ.12,064 కోట్లుగా పేర్కొన్నారు. స్థూల జాతియోత్పత్తిలో ఆర్థికలోటు రూ.2.30 కోట్లు, స్థూల జాతియోత్పత్తిలో రెవెన్యూ లోటు రూ.1.16 కోట్లు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం రెవెన్యూ లోటు రూ.25, 574 కోట్లు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం ద్రవ్య లోటు రూ.37, 910 కోట్లుగా పేర్కొన్నారు. 
 
నీటిపారుదల శాఖకు రూ.8,465 కోట్లు, హోం శాఖకు రూ.3,734 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.4,260 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.3,134 కోట్లు, వెనుకబడిన తరగతలు సంక్షేమానికి రూ.3,130 కోట్లు, విపత్తు నిర్వహణకు రూ. 403 కోట్లు, ఐటి శాఖకు రూ.111 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.615 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,115 కోట్లు, ఇంధన శాఖకు రూ.7,164 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.371 కోట్లు, యువజన సర్వీసుల శాఖకు రూ.126 కోట్లు, మహిళా సంక్షేమ శాఖకు రూ.104 కోట్లు, వికలాంగుల సంక్షేమం, వృద్ధులకు రూ.65 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.1,150 కోట్లు, మౌలిక వసతులకు రూ.73 కోట్లు, రోడ్లు, భవనాలు శాఖకు రూ.2,612 కోట్లు, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.418 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యకు రూ.812 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,275 కోట్లు, పాఠశాల విద్యకు రూ.12,595 కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు రూ.4,388 కోట్లు, కార్మిక, ఉపాధి కల్పనకు రూ.276 కోట్లు చొప్పున కేటాయించారు.