Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రబ్బర్ సింగో, గబ్బర్ సింగో తేల్చుకోవాలి: వైసీపీ ఎమ్మెల్యే రోజా

శుక్రవారం, 30 జూన్ 2017 (09:06 IST)

Widgets Magazine

సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ రబ్బర్ సింగో, గబ్బర్ సింగో తేల్చుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ప్లీనరీ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై రోజా విమర్శలు గుప్పించారు. ప్ర‌శ్నిస్తానన్న మొనగాడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడెక్క‌డున్నార‌ని రోజా నిల‌దీశారు. కాపులను ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తుంటే పవన్ ప్ర‌భుత్వాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని అడిగారు. 
 
చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌న‌ని చెప్పుకున్న జ‌న‌సేనాని ఇప్పుడు జీఎస్టీ వ‌ల్ల ప‌డ‌బోతున్న ప‌న్నుపోటు గురించి ఎందుకు అడ‌గ‌డం లేద‌ని ఆమె విమ‌ర్శ‌లు చేశారు. పనిలో పనిగా ఏపీ సర్కారుపై రోజా నిప్పులు చెరిగారు. గిరిజ‌నుల‌ ఓట్ల కోసం కొండలు ఎక్కి వారిని క‌లిసే రాష్ట్ర‌మంత్రులు.. ఇప్పుడు గిరిజ‌నుల ఆరోగ్యాలు పాడైపోతుంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వ‌డం లేద‌న్నారు. 
 
చంద్రబాబును నమ్మి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలో చేరిన నేతల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి అనతి కాలానికే గుండెపోటుకు గురి కాగా, జ్యోతుల నెహ్రూ వెన్నుపోటుకు గురయ్యారన్నారు. మంత్రి పదవి ఆశ చూపి జ్యోతుల నెహ్రూను తెలుగుదేశం పార్టీలోకి లాగారన్నారు. చంద్రబాబు విసిరిన బిస్కెట్లకు ఆశ పడి పార్టీ మారిన నెహ్రూ చివరకు వెన్నుపోటుకు గురయ్యారని ఎద్దేవా చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రంప్ వీసా సవరణ ప్రమాణాల ప్రకారం తాతయ్య అమ్మమ్మలకు వీసా చెల్లదు

ముస్లిం దేశాలపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. విధించిన నిషేధాన్ని ...

news

జూలై 1 నుంచి వనం-మనం... అమరావతిలో నైట్ సఫారీ

అమరావతి: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో వనం-మనం కార్యక్రమం ...

news

పవన్-రజినీతో మాట్లాడుతున్నాం... దక్షిణాది ఉద్యమం జెండా రెపరెప... గద్దర్

ప్రజా గాయకుడు గద్దర్ పలుకు పలుకుకీ ఓ పవర్ వుంటుంది. ఆ పవర్‌కి పవర్ స్టార్ తోడైతే... ...

news

జూలై నుంచి మీ బీమా ప్రీమియం పెరుగుతోంది... మోదీ GST, సౌదీలో ఫ్యామిలీ ట్యాక్స్

చూస్తుంటే జూలై 1ని ప్రపంచ పన్నుపోటు దినోత్సవంలా ప్రకటించేలా ఉన్నారు దేశ, ప్రపంచ ...