శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 1 ఆగస్టు 2017 (15:16 IST)

పవన్ పదేపదే చిరుని అలా ఎందుకంటున్నారు? తిరిగి చిరు అలా అంటే?

ఎంతటివారైనా నోరు జారడం మామూలే. పెద్దపెద్దవాళ్లే నోరు జారి తిప్పలు తెచ్చుకున్నారు చాలా సందర్భాల్లో. ఇంతకీ ఇక్కడ చెప్పొచ్చేదేమిటయా అంటే... పవన్ కళ్యాణ్ ను మీడియా కొన్ని ప్రశ్నలు వేసింది. 2014 ఎన్నికల్లో మీరు తెదేపా-భాజపాలకు మద్దతు ఇచ్చారు కదా... మళ్లీ

ఎంతటివారైనా నోరు జారడం మామూలే. పెద్దపెద్దవాళ్లే నోరు జారి తిప్పలు తెచ్చుకున్నారు చాలా సందర్భాల్లో. ఇంతకీ ఇక్కడ చెప్పొచ్చేదేమిటయా అంటే... పవన్ కళ్యాణ్ ను మీడియా కొన్ని ప్రశ్నలు వేసింది. 2014 ఎన్నికల్లో మీరు తెదేపా-భాజపాలకు మద్దతు ఇచ్చారు కదా... మళ్లీ 2019 ఎన్నికల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అనుకోవచ్చా అని ప్రశ్నించారు. 
 
దీనికి పవన్ టక్కున సమాధానమిస్తూ... ప్రజల కోసం సొంత అన్నయ్యతోనే విభేదించినవాడిని. అలాంటప్పుడు తేడా చేస్తే తెదేపాతో కలిసి వుంటానని మీరెలా అనుకుంటారు? అని ఎదురు ప్రశ్నించారు. అలా పవన్ చేసిన వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ కాస్త ఇబ్బందిపడ్డారు. 
 
అన్నయ్య చిరును లాగడం ఎందుకబ్బా అని గొణుక్కున్నట్లు సమాచారం. సర్లే... పవన్ అంటే అన్నాడు. అదేమాటను తిరిగి చిరంజీవి అంటే... పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఐతే చిరంజీవి మాత్రం అలా వ్యాఖ్యానించే పరిస్థితే వుండదు. ఎందుకంటే చిరంజీవికి తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం మరి.