గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (18:21 IST)

విజయవాడలో విషాదం... ప్రేమ జంట ఆత్మహత్య

విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ లోని శ్రీదేవి లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడ నగరంలో వన్‌టౌన్ పరిధిలో శ్రీదేవి లాడ్జీ ఉంది. గుర్తు తెలియని ఇద్దరు యువతి, యువకుడు అద్దెకు గది తీసుకున్నారు. 
 
ఈ స్థితిలో శుక్రవారం వారు ఉన్న గది ఎంతకీ తెరవకపోవడంతో లాడ్జీ సిబ్బందికి అనుమానం ఏర్పడింది. దీంతో తలుపు పగులగొట్టి చూడగా ఆ యువ జంట ఆత్మహత్య చేసుకుని మృత దేహాలుగా దర్శనమిచ్చింది.
 
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే లాడ్జి యజమాని పరారయ్యాడు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఆ జంట ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, లాడ్జీ యజమాని ఎందుకు పరారైయ్యాడు వంటి వివరాల కోసం విచారణ చేపట్టారు.