శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 16 మే 2017 (04:36 IST)

నిన్నటి వరకు మోదీ మంచివాడు.. నేడు అంటరానివారయ్యారా: జగన్ సూటి ప్రశ్న

రాష్ట్రంలో నెలకొన్న వివిధ పరిస్థితులపై ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాసినట్టు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జగన్‌ తెలిపారు. చంద్రబాబు తన అధికారంతో వ్యవస్థలను మేనేజ్‌ చేస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా జగన్‌ ప్రశ్నించ

రాష్ట్రంలో నెలకొన్న వివిధ పరిస్థితులపై ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాసినట్టు  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జగన్‌ తెలిపారు. చంద్రబాబు తన అధికారంతో వ్యవస్థలను మేనేజ్‌ చేస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా జగన్‌ ప్రశ్నించారు.  అధికారులను ఏపీ సీఎం ప్రలోభపెట్టి తప్పుల మీద తప్పులు చేయిస్తున్నారని ఆరోపించారు. 
 
సాక్షులను ప్రభావితం చేస్తున్నానని తన బెయిల్‌ రద్దుచేయాలని కోర్టుకెళ్లారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండని లేఖలు రాయడం సహజమేనని జగన్ స్పష్టం చేశారు. తాను రాసిన లేఖకు ఏప్రిల్‌ 13న ప్రధాని నుంచి ప్రత్యుత్తరం వచ్చిందని చెప్పారు. 
 
ఇటీవల దిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో గంటపాటు వివిధ అంశాలపై మాట్లాడినట్టు జగన్‌ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఆయనతో 10-15 నిమిషాలు మాట్లాడినట్టు చెప్పారు. అగ్రిగోల్డ్‌, మిర్చి రైతుల సమస్యలపైనా మోదీతో చర్చించినట్టు జగన్‌ తెలిపారు. 
 
మోదీ జగన్‌కు ఎందుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని తెదేపా నేతలు మాట్లాడుతున్నారనీ, నిన్నటి వరకు మోదీ మంచివాడు.. తాను కలిసి వచ్చేసరికి ఆయన అంటరానివారయ్యారా అని జగన్‌ ప్రశ్నించారు.
 
అమరావతి వ్యవసాయోత్పత్తుల రేట్లు రైతు దగ్గర నుంచి వ్యాపారుల వరకు వెళ్లేసరికి మారుతున్నాయని, దళారులు, వ్యాపారులు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైకాపా అధినేత జగన్ అన్నారు. 92 లక్షల క్వింటాళ్లు పండితే కనీసం 50 లక్షల క్వింటాళ్లు రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. 
 
మిర్చి రైతుకు కౌలు లేకుండా ఎకరాకు రూ.1.30లక్షల నుంచి రూ.1.60 లక్షలు ఖర్చవుతుందని, ఏ పంట చూసుకున్నా రైతులు బతికే పరిస్థితి లేదన్నారు.