మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (17:41 IST)

సీఎం జగన్ భావోద్వేగం... కన్నీటిపర్యంతమైన ఎమ్మెల్యేలు...

వైకాపా అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కన్నీటిపర్యంతమయ్యారు. బుధవారం తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో 151 మంది ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. శనివారం తన మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేలతో సమావేశమై.. మంత్రివర్గం కూర్పు, పరిపాలన, తదితర అంశాలపై చర్చించారు. 
 
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. తనతో పాటు పార్టీ నేతలు కూడా ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తుచేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనతో పాటు ప్రయాణించారని, ఎవరికీ అన్యాయం చేయనని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
 
పైగా, ఎవరినీ విస్మరించనని, అలాగే ఎవరినీ కూడా వదులుకోనని స్పష్టం చేశారు. అందరం కలిసి ప్రజలకు సేవ చేద్దామని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ నేతలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.
 
ఈ సమావేశం అనంతరం పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వైఎస్‌ జగన్‌లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పుకొచ్చారు. పదవుల్లో సామాజిక న్యాయం చేసిన ఘటన వైఎస్‌ జగన్‌దని, మాటలు చెప్పడం కాదని... చేతల్లో చూపిస్తున్నారన‍్నారు. 
 
సామాజిక వర్గాల వారీగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల ఓ దశలో తాను షాక్‌కు కూడా గురయ్యానన్నారు. జగన్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ స్వర్ణయుగం కాబోతుందని బొత్స వ్యాఖ్యానించారు.