Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డెల్టాను ఎండబెట్టారు.. రైతుల ఉసురు తీశారు.. మీరు మనిషేనా బాబూ: జగన్ ధ్వజం

హైదరాబాద్, మంగళవారం, 31 జనవరి 2017 (05:57 IST)

Widgets Magazine
Jagan-babu

కృష్ణా జిల్లాలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన వైకాపా అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ పంటల నష్టాన్ని కళ్లారా చూసి శివాలెత్తిపోయారు. పచ్చని పంటపొలాలతో సస్యశ్యామలంగా ఉండాల్సిన కృష్ణా జిల్లా డెల్టాను బంజరు భూములుగా చేసిన ఘనత చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. రాజధానిలోనే ఉంటున్నానని డబ్బాలు కొట్టుకునే ముఖ్యమంత్రీ, ఈ జిల్లాలోనే ఉన్న ఇరిగేషన్ మంత్రీ ఇద్దరూ పచ్చని పొలాల్లో పంటలు చచ్చిపోతుంటే కళ్లప్పగించి చూస్తున్నారనంటూ మండిపడ్డారు. 
 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రెండేళ్లుగా కృష్ణా డెల్టాకు సరిగా నీళ్లు ఇవ్వడమే లేదు. పంటలు చచ్చిపోతున్నాయని రైతులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రాజధానిలో మూడునాలుగు పంటలు పండే 54వేల ఎకరాలను బలవంతంగా తీసుకుంటారు. డెల్టాలోనేమో పంటలకు సాగు నీరే ఇవ్వరు. ఈ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది’ అని తీవ్రంగా వైఎస్‌ జగన్‌ తీవ్రంగా విమర్శించారు. 
 
దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేశారు. తెలంగాణాకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద పెండింగ్‌లో ఉన్నరూ.120 కోట్లు చెల్లిస్తే ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు 45 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. అప్పుడు పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి అక్కడి నుంచి డెల్టాకు నీరు అందించవచ్చు. అలా చేస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాటన్‌ దొర మాదిరిగా డెల్టా ప్రజల గుండెల్లో ఉండిపోతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే తెలంగాణ ఎన్ని లేఖలు రాసినా రూ.120 కోట్లు ఇవ్వడం లేదు. దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్ జగన్ ఆక్షేపించారు.
 
పట్టిసీమ నీళ్లు ఎక్కడికి వెళ్లాయో తెలీడమే లేదు.  ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటికీ 55 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి  విడిచిపెట్టారు. ఇక ఆ పట్టిసీమ వల్ల ఉపయోగమేమిటి  కృష్ణ, గోదావరి రెండింటికీ ఒకేసారి వరదలు వస్తాయని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. నిల్వ సదుపాయం లేకుండా కమీషన్ల కోసం తెచ్చిన వృథా ప్రాజెక్టు అది. నిల్వ సదుపాయం ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రాజెక్టు పులిచింతల.. ఈ రెండింటినీ పరిశీలిస్తే చాలు చంద్రబాబు రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నాడో తెలుసుకోవడానికి’’ అని జగన్‌ పేర్కొన్నారు. 
 
చంద్రబాబు ఇదే గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే వెళ్తుంటారు. కానీ ఏనాడూ గన్నవరం నియోజకవర్గంలో ఎండిపోయిన పంటలు ఎలా ఉన్నాయో చూసిన పాపాన పోలేదు. ఇరిగేషన్‌ మంత్రిదీ ఇదే జిల్లా. ఆయన కూడా ఇదే గన్నవరం ఎయిర్‌పోర్టుకు నుంచే వెళ్తుంటారు. ఆయనా ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పంటల గురించి, రైతుల గురించి పట్టించుకోనే లేదు. పంటలు పోయి రైతులు ఆగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు నేను, మా పార్టీ  అండగా ఉంటాం అని జగన్ చెప్పారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇలా చేస్తే అమెరికాలో ట్రంప్ బారి నుంచి బయటపడవచ్చట ఎలా?

ఉగ్రవాదుల కట్టడి విషయంలో ఇచ్చిన మాట మేరకు అన్నంత పనీ చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ...

news

ఎప్పుడు ప్రకటించామన్నది కాదయ్యా పవన్.. ఇచ్చామో లేదో చూడవేం.. వెంకయ్య బుసబుస..!

ఒకరేమో సినిమాల్లో పంచ్ డైలాగుల కింగ్. మరొకరేమో రాజకీయాల్లో తిరుగులేని పంచ్ డైలాగుల కింగ్. ...

news

హోదాలో ఏముంది బొంద. అన్నీ ప్యాకేజీలో ఉంటే.. అంటున్న వెంకయ్య

ప్రత్యేక హోదా అంటూ పాత చింతకాయపచ్చడిని పట్టుకు వేళ్లాడుతున్నఏపీ ప్రతిపక్షాలకు కేంద్రం ...

news

చేసిన తప్పులకు మన్నించండి ఓటరు దేవుళ్లారా.. తన చెప్పుతో తానే దండించుకున్న మాజీ ఎమ్మెల్యే

తప్పులు చేసి ఉంటే మన్నించి మరిచిపోండి. నేనిప్పుడు మారిన మనిషిని. మీ మనిషిని. మీకు సేవ ...

Widgets Magazine