శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 మే 2017 (11:32 IST)

ఎన్నికలంటూ జరిగితే వైకాపాకు 118 - తెదేపాకు 37 సీట్లు : అభ్యర్థుల గెలుపుగుర్రాలపై జగన్ సర్వే

వచ్చే ఎన్నికల కోసం వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎవరన్నదానిపై ఆయన సర్వే చేయిస్తున్నారు. అంతేకాకుండా ఓ రాజకీయ నేత ద్

వచ్చే ఎన్నికల కోసం వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎవరన్నదానిపై ఆయన సర్వే చేయిస్తున్నారు. అంతేకాకుండా ఓ రాజకీయ నేత ద్వారా రహస్యంగా జరిపించిన సర్వేలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే వైకాపాకు 118 సీట్లు, అధికార తెలుగుదేం పార్టీకి 37 సీట్లు వస్తాయని తేలింది. 
 
దీంతో జగన్ మోహన్ రెడ్డి అప్రమత్తమై... ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి విజయావకాశాలపై సర్వే చేయిస్తున్నారు. అంతేకాదు, ద్వితీయ శ్రేణినాయకులు, ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి రాబోయే నేతల గురించి కూడా సమాచారం తెప్పించుకుంటున్నారు. 
 
ఇప్పటికే ఈ సర్వేకు సంబంధించి కొంతమేర సమాచారం జగన్‌కు అందిందని విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గాల వారీగా పక్కా సమాచారాన్ని సేకరించే పనిలో జగన్ ఉన్నారు. త్వరలో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశాల నాటికి ఈ సర్వే పూర్తి చేసి, సమావేశాల్లో దీనిపై చర్చించాలని జగన్ భావిస్తున్నారు.
 
సర్వే కోసం ప్రదానంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారట. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, నియోజకవర్గ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వారికి టికెట్ ఇస్తే.. వారు గెలుపొందే అవకాశాలు, ద్వితీయ స్థాయి నాయకులు పోటీ చేస్తే వారు గెలుపొందే అవకాశాలపై సర్వే చేయనున్నారు. దీనికి తోడు ఇతర పార్టీలకు చెందిన వారు ఎవరైనా వైసీపీలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారా?... వారి రాకతో పార్టీకి ఎంతమేర లాభం ఉంటుంది? అనే విషయాలపై కూడా ఆయన ఆరా తీస్తున్నారట.