గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (13:43 IST)

ప్రత్యేక హోదా తేగలవా? ఎందుకయ్యా ఊరకే మాట్లాడతావ్!: జగన్

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ సాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోవడంతోనే ప్రత్యేక హోదాపై కేంద్రం వద్ద పట్టుబట్టకలేకపోతున్నారని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇందుకు అధికార పక్షం కూడా విపక్ష నేతపై ఆరోపణలు గుప్పించాయి. 
 
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నాయని.. ఇన్ని నెలలైనా ప్రత్యేక హోదాపై చంద్రబాబు నిక్కచ్చితమైన సంకేతాలను కేంద్రానికి పంపారా అంటూ ప్రశ్నించారు. కేంద్రంపై ప్రత్యేక హోదాపై డెడ్ లైన్ విధించగలరా? కేంద్రానికి ఏపీ నుంచి హెచ్చరికలు ఇవ్వగలరా? అలా ప్రత్యేక హోదా తేలేని వారు ''ఎందుకయ్యా ఊరకే మాట్లాడతావ్'' అని ఎద్దేవా చేశారు. నెల రోజుల్లో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. మంత్రులను ఉపసంహరించుకుంటామని గట్టి ఒత్తిడి తేవాలని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును విజ్ఞప్తి చేశారు.
 
సాధారణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తలచుకుంటే ప్రత్యేక హోదా వెంటనే వచ్చేస్తుందని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం పెద్ద సమస్య కాదని, ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘం రద్దు కావడానికి 7 నెలల సమయం పట్టిందని, మనం పట్టుబట్టి ఉంటే అప్పుడే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు.