Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే తంతు.. కొనిపారేశారన్న జగన్.. సింహం సింగిల్‌గానే..?

సోమవారం, 20 మార్చి 2017 (16:48 IST)

Widgets Magazine
ys jagan

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను కొనేసిందని జగన్ ఆరోపించారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేసిందని జగన్ ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్ఆర్ సిపి గట్టిపోటీ ఇచ్చిందన్నారు. అధికారికంగా టిడిపి గెలిచినా నైతిక విజయం తమదేనని ఆయన చెప్పారు.
 
డబ్బులు చల్లి గెలుచుకోవడం ఓ గెలుపేనా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులను అద్భుతంగా కొనుగోలు చేశాడని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ టిడిపి ఎమ్మెల్యే పట్టుబడిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే తంతు జరిగిందని చెప్పారు.
 
మరోవైపు వైకాపా నేత రోజా కూడా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. నిషేధానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏడాది తరువాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచిందని అన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని, ప్రజా క్షేత్రంలో గెలిచి తీరుతామన్నారు. 
 
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష పడకపోవడం వల్లే చంద్రబాబు మళ్లీ ఏపీలో కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకున్నారన్నారు. రూ.300 కోట్లు ఖర్చుపెట్టి ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించింది సీఎం చంద్రబాబే అని దుయ్యబట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మనువరాలిపై ఏడాదిపాటు తాత అత్యాచారం.. వేధింపులు తాళలేక బాధితురాలి ఆత్మహత్య

వావివరసలు మంటగలిసిపోయాయి. కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. వయో తారతమ్యం లేకుండా బాలికల ...

news

భర్తను హత్య చేసి బీఎండబ్ల్యు కారులో కుక్కింది... కారు తాళాలు మర్చిపోయింది... ఏం జరిగింది?

ఇటీవలి కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కారణాలు ఏవైతేనేమి ...

news

రోజావి కులదురహంకార వ్యాఖ్యలే.. అనిత ఫిర్యాదు చేస్తే..?: కారెం శివాజీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు కష్టాలు తీరేలా లేవు. ఓవైపు సస్పెన్షన్ వేటు ...

news

పాక్‌‍లో హిందూ మ్యారేజ్ బిల్లు 2017కు చట్టబద్ధత.. పీఎంవో ప్రకటన

పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సర్కారు ఆ దేశంలోని మైనారిటీలుగా ఉన్న హిందువులకు ...

Widgets Magazine