శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 31 మార్చి 2015 (09:24 IST)

పన్ను కట్టలేదని ఇంటి ముందు చెత్త ట్రాక్టర్.. ఆత్మహత్య చేసుకున్న యజమాని

మునిసిపాలిటీ వారికి ఎన్ని చెప్పినా వారి మురికి ఆలోచనలు పోవు. జనం నుంచి వసూలు చేయండి అంటే రౌడీ గ్యాంగులను మీరిన ఆలోచనలతో జనాన్ని పీడిస్తున్నారు. కోర్టులు మొట్టికాయలు వేసినా వీరి వసూలు బుద్ధి మారడం లేదు. ఓ ఇంటి యజమాని ఇంటి పన్ను కట్టలేదని ఆయన ఇంటి ముందు ట్రాక్టర్ పెట్టి ఆయన ఆత్మహత్యకు మునిసిపాలిటీ అధికారులు కారణమయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
పుంగనూరుకు చెందిన ఆదినారాయణ మునిసిపాలిటీకి ఇంటి పన్ను బకాయీ ఉన్నారు. దీన్ని చెల్లించడంలో ఆలస్యం చేశారు. పన్ను చెల్లించాలని ప్రశ్నించడంతో కొన్ని రోజులు సమయం ఇవ్వాలని కోరారు. అయితే మునిసిపాలిటీ అధికారులు ఆయన వినతిని పట్టించుకోకుండా ఆయన ఇంటి ముందు చెత్త ట్రాక్టర్ను నిలిపారు. మున్సిపల్ అధికారుల చర్యను అవమానంగా భావించిన ఆదినారాయణ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
 
మృతుడు ఆదినారాయణ వైఎస్సీర్ సీపీ రైతు విభాగం పుంగనురు అధ్యక్షుడు కూడా. మున్సిపల్ అధికారులే ఆదినారాయణను పొట్టనబెట్టుకున్నారంటూ ఆయన భార్యా, పిల్లలు పెద్దపెట్టున రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. అధికారులపై హత్య కేసు నమోదుచేయాలని కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.