బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (11:10 IST)

వైకాపా ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను వైకాపా ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు వైకాపా కార్యాలయంలో రాష్ట్రావతరణ వేడుకలు జరిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరిత తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలను వైఎస్ఆర్ సీపీ జరుపుతుందని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.