Widgets Magazine Widgets Magazine

నాన్న కోరిక మేరకే సినిమాల్లోకి వచ్చా : ఆర్కే.రోజా

సోమవారం, 15 మే 2017 (09:37 IST)

Widgets Magazine
rk roja

మా నాన్న కోరిక మేరకే సినిమాల్లోకి వచ్చానని సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా చెప్పుకొచ్చారు. ఆమె ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను ఆర్టిస్టు అవ్వాలన్నది తన తండ్రి కోరిక అని, అందుకే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. 
 
‘నేను సినిమాల్లోకి రావడం మా అమ్మకు, అన్నయ్యలకు ఇష్టం లేదు. మా నాన్న సారథి స్టూడియోస్‌లో సౌండ్ ఇంజనీర్‌గా చేసేవారు. ‘ఆర్టిస్ట్‌గా నాకు రాని అవకాశం నీకు వచ్చింది. నటిస్తే బాగుంటుంది’ అని మా నాన్న అన్నారు. మా అమ్మ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా చేసేవారు. నాకు తోడుగా ఉండాలని చెప్పి, తాను చేస్తున్న ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టింది. అలాగే మా అన్నయ్యలు కూడా వాళ్ల చదువులు వదిలి పెట్టి నాకు తోడుగా చెన్నైకు వచ్చారు.
 
ఎందుకంటే, మా మూడు జనరేషన్స్‌లో నేను ఒక్కదాన్నే ఆడపిల్లను. మిగిలిన ఆర్టిస్టుల తల్లుల కంటే మా అమ్మ చాలా అమాయకురాలు. మా అన్నయ్యలు ఏం చెబితే అది. మా అమ్మ నాతో పాటు షూటింగ్‌కు రావడం, నాకు భోజనం పెట్టడం, మళ్లీ షూటింగ్ నుంచి నాతో పాటు రూమ్‌‌కు రావడం తప్పా, ఆమెకేమీ తెలియదు. సిస్టమేటిక్‌గా ఈ రోజున నేను ఉన్నానంటే, దానికి కారణం మా అమ్మే. ఆమె నుంచే నేను నేర్చుకున్నాను’ అని రోజా చెప్పుకొచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోహ్‌టక్‌ రేప్ కేస్.. జననాంగంలో పదునైన వస్తువులు చొప్పించి..

హర్యానా రాష్ట్రంలోని రోహ్‌టక్‌లో 23 యేళ్ల దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, దారుణ ...

news

పెద్ద నోట్ల రద్దు దెబ్బ కాదు.. వాన్నా క్రై వైరస్ దెబ్బ.. దేశవ్యాప్తంగా ఏటీఎమ్‌ల మూసివేత

పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఇప్పటికీ దేశంలో 60 నుంచి 75 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. ఇప్పుడు ...

news

ఇక ఎమ్మెల్యేలు.. ఎంపీలకు చంద్రబాబు పదవులు ఇవ్వనన్నారు... ఎంపీ మురళీమోహన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ...

news

జగన్‌ని అందుకే లొంగదీసారు.. తెలుగుదేశం పార్టీకి డేంజర్ బెల్స్

ఒక ఆర్థిక ఉగ్రవాదికి ప్రధాని ఎలా అప్పాయింట్మెంట్ ఇస్తారంటూ మోదీ-వైఎస్ జగన్ భేటీపై ...