Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తాడట... 'జబర్దస్త్' కామెడీ కంటే లోకేష్ కామెడీ చాలా బాగుంది : రోజా ఎద్దేవా

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (09:41 IST)

Widgets Magazine

రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా తనదైనశైలిలో సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ లోకేష్ చెప్పగానే.. ఆయన మామ బాలకృష్ణ హిందూపురంలో అమలుచేసి చూపించారని రోజా ఎద్దేవా చేశారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ మంత్రి పదవి చేపట్టాక లోకేశ్‌ చేస్తున్న కామెడీ జబర్దస్త్‌ను దాటేసిందన్నారు. అందువల్ల ఇకపై జబర్దస్త్ షోకు వీక్షకులు తగ్గిపోతారేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని సృష్టించడానికే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని అయ్యానంటూ తన మనసులో మాటను లోకేశ్‌ బయటపెట్టారని అన్నారు.
 
చెప్పినవిధంగానే తన తండ్రి, మామ నియోజకవర్గాలైన కుప్పం, హిందూపురంలో నీళ్లు దొరక్కుండా చేశారన్నారు. లోకేశ్‌ ప్రతి మాటలోనూ తప్పులు దొర్లుతున్నాయని, వాటిని ప్రసారం చేస్తున్న సోషల్‌ మీడియాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పుస్తకమై వెలిగిన బాహుబలి పాత్ర.. తెలుగులో విడుదలైన 'శివగామి కథ'. డోంట్ మిస్

బాహుబలి సినిమా మూలస్థంబాల్లో అతి పెద్ద మూలస్తంభం శివగామి. నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ ...

news

వచ్చే నెలలో మూడో ప్రపంచ యుద్ధం... జోస్యం చెప్పిన మిస్టిక్ హొరాసియో విల్లెగాస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోతారనీ, డోనాల్డ్ ట్రంప్ గెలుపొంది అధ్యక్ష ...

news

మా అత్త త్యాగశీలి... జయలలిత - శశికళ సంభాషణల వీడియో లీక్ చేస్తా : జయానంద్

మా అత్త శశికళ త్యాగశీలి అని, అపోలో ఆస్పత్రిలో ఆమెకు, జయలలితకు ముధ్య జరిగిన సంభాషణల ...

news

విలీనం ఒక డ్రామాయేనా... అన్నాడీఎంకేలో ఆకస్మిక పరిణామాలపై అనుమానాలు.. పన్నీరు సెల్వం మళ్లీ పావేనా?

అన్నాడీఎంకేలోని రెండువర్గాల విలీనం పథకం ప్రకారం ఆడుతున్న నాటకమని కేంద్ర మంత్రి పొన్‌ ...

Widgets Magazine