గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (10:37 IST)

సారీ సార్.. నోరు జారా... క్షమించండి.. స్పీకర్‌కు సారీ చెబుతూ లేఖ రాసిన రోజా

వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఎట్టకేలకు దిగివచ్చింది. గత శాసనసభ సమావేశాల్లో సభానేత నారా చంద్రబాబునాయుడు, సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్‌లపై నిండు సభ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన విష

వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఎట్టకేలకు దిగివచ్చింది. గత శాసనసభ సమావేశాల్లో సభానేత నారా చంద్రబాబునాయుడు, సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్‌లపై నిండు సభ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 
 
దీంతో ఆమెపై ఒక యేడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సారీ చెబితే వదిలేస్తామన్న సర్కారు మాటలను ఆమె తొలతు పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత హైకోర్టులోనే కాకుండా అటు సుప్రీంకోర్టులోనూ న్యాయ పోరాటం చేశారు. అయితే ఎక్కడా ఆమెకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో చివరకు దిగివచ్చి.. సారీ చెప్పారు. 
 
ఈ మేరకు లిఖితపూర్వకంగా రోజా రాసిన క్షమాపణ లేఖ నిన్న స్పీకర్ కార్యాలయానికి చేరింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రోజా కామెంట్లకు టీడీపీ ఎమ్మెల్యే అనిత నిండు సభ సాక్షిగా కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా రోజా తన క్షమాపణ లేఖలో ప్రస్తావించారు. నాడు తాను చేసిన వ్యాఖ్యలు అనితను బాధించి ఉంటే... ఆమెకు కూడా సారీ చెబుతున్నట్లు రోజా సదరు లేఖలో పేర్కొన్నారు.