Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిధులు తేలేని దద్దమ్మ చంద్రబాబు... రోజా తీవ్ర వ్యాఖ్యలు

బుధవారం, 11 అక్టోబరు 2017 (19:37 IST)

Widgets Magazine
roja

వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్టుతో మూలుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు నాయుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర విషయమై మీడియాతో మాట్లాడారు రోజా.
 
రాష్ట్రం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే చంద్రబాబు జల్సాల కోసం అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. జగన్ యువభేరి విజయవంతం కావడంతో ఏపీ మంత్రులకు పిచ్చిపట్టిందని అన్నారు. వాళ్లేమి మాట్లాడుతున్నారో వారికే తెలియడంలేదని ఎద్దేవా చేశారు. ఇక నవంబర్ 2 నుంచి జగన్ తలపెట్టనున్న పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకుంటారని అన్నారు.
 
పాదయాత్ర అనేది వైఎస్ ఫ్యామిలీ బ్రాండ్ మార్క్ అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా కాదు... ప్రత్యేక ప్యాకేజీ చాలు అని చెపుతున్న ప్రభుత్వం ఆ ప్యాకేజీతో ఏమేమి చేశారో వివరించాలని డిమాండ్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే : సుప్రీంకోర్టు ధర్మాసనం

మైనర్ భార్యతో శృంగారం చేయడం అత్యాచారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 15 ...

news

హ్యాకింగ్ వల్లే అమెరికా కుట్రను బయటపెట్టాం: ఉత్తరకొరియా హ్యాకర్లు

అమెరికా లక్ష్యం తమ దేశాధ్యక్షుడిని హతమార్చేందుకు.. దానికి దక్షిణ కొరియా పూర్తి సహకారం ...

news

జగన్ ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేసేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత ...

news

హనీప్రీత్ సింగ్ చెప్పును కూడా వదల్లేదు.. ఫోటో తీసిన మీడియా.. సెల్ఫీల కోసం..

డేరా బాబా సన్నిహితురాలు, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ...

Widgets Magazine