Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వైకాపాలోకి కేంద్ర మాజీ మంత్రి కిల్లి... బీజేపీలోకి మేకపాటి జంప్?

గురువారం, 31 ఆగస్టు 2017 (13:27 IST)

Widgets Magazine
mekapati rajamohan reddy

ఇప్పటికే నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోగట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టు కనిపిస్తున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పుకార్లు వినిపిస్తున్నాయి. 
 
అదేసమయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి కూడా గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కాషాయం గూటికి చేరనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
వాస్తవానికి 2014కు ముందువరకూ శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట. రాష్ట్ర విభజన పుణ్యమా అని జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైపోయింది. జిల్లాలో పార్టీ పరిస్థితిని గమనించిన ధర్మాన వంటి నేతలు ముందే తట్టాబుట్టా సర్ధుకున్నారు. ఇక జిల్లాలో మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్, కిల్లి కృపారాణిలే ఆ పార్టీకి పెద్దదిక్కయ్యారు. అప్పుడప్పుడూ వారు చిన్నాచితకా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు కాంగ్రెస్‌ని మరిచిపోకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.
 
ఇలాంటి తరుణంలో జిల్లా కాంగ్రెస్‌ను మరో అంశం కలవరపెడుతోంది. మన్మోహన్‌ సింగ్ క్యాబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి పార్టీ మారబోతున్నట్టు గత వారం రోజులుగా జిల్లాలో టాక్ నడుస్తోంది. టీడీపీలో రాజకీయ దిగ్గజంగా వర్థిల్లిన దివంగత ఎర్రంనాయుడుపై అనూహ్య విజయం సాధించి కాంగ్రెస్ హైకమాండ్‌కు అప్పట్లో కృపారాణి దగ్గరయ్యారు. ఆమెను కేంద్రమంత్రి పదవి కూడా వరించింది. అయితే అదంతా పూర్వవైభవం. ధర్మాన అండదండలతో రాజకీయంగా ఎదిగిన కృపారాణి గతంలోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళతారంటూ గుసగుసలు వినిపించాయి.
 
అలాగే, నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి ప్రభావం వైసీపీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తమ భవిష్యత్తుపై ఆందోళన రేకిత్తిస్తోంది. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండడంతో ఇప్పుడే మేలుకుంటే మంచిదనే భావన వారిలో కనిపిస్తోంది. అందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితోపాటు ఆయన తనయుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిలు బీజేపీలే చేరేందుకు పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను మేకపాటి రాజమోహన్ రెడ్డి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ysrcp Mp Join Bjp Killi Kriparani Mekapati Rajamohan Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్యతో అక్రమ సంబంధం.. ఇనుపరాడ్‌తో కొట్టి... గోనె సంచిలో కట్టి...

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రేమకు- వివాహానికి విలువ లేకుండా పోతుంది. సహజీవనం ...

news

డేరా బాబా కేసులో తీర్పు చెప్పిన జడ్జికి జడ్‌ప్లస్ సెక్యూరిటీ

ఆశ్రమంలోని సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం ...

news

చావుకు చిహ్నమైన నంబరుకు వేలం పాటలో రూ.12.8 కోట్ల ధర

తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. దీన్ని క్యాష్ ...

news

'కిమ్ మాటలతో వినేరకం కాదు'.. ట్రంప్ ట్వీట్ : న్యూక్లియర్ సూపర్‌బాంబ్ టెస్ట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ...

Widgets Magazine