జగన్ మాటే వేదం... రాజీనామాలకు సిద్ధం : వైవీ సుబ్బారెడ్డి

బుధవారం, 11 అక్టోబరు 2017 (07:21 IST)

yv subbareddy

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను ఇవ్వాలని వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానంటూ ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 
 
ప్రత్యేక హోదా నిమిత్తం తమ పార్టీ అధినేత జగన్ ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని, జగన్ చెప్పిన వెంటనే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తామని అన్నారు. 
 
అయితే, ఇప్పుడే రాజీనామా చేయడంలో అర్థం లేదని, తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్‌లో మాట్లాడేవారే ఉండరని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన తర్వాత, తమ పదవులకు రాజీనామా చేస్తే ఉపయోగం ఉంటుందని సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. దీనిపై మరింత చదవండి :  
Ysrcp Mp Special Status Y. V. Subba Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

డోనాల్డ్ ట్రంప్ సవతుల కీచులాట.. ఎందుకో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నిద్రలేకుండా ...

news

ఒక స్థానం.. ఇద్దరు నేతలు : అమేథీలో నువ్వానేనా అంటున్న ఆ ఇద్దరు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ లోక్‌సభ స్థానానికి ప్రత్యేక పేరుతో పాటు గుర్తింపు ఉంది. ఈ ...

news

హిందువుల అంత్యక్రియలపై కూడా నిషేధం ఉంటుందేమో : త్రిపుర గవర్నర్ సెటైర్

త్రిపుర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా, దేశ ...

news

భారత ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రి జవదేకర్లతో కోడెల సమావేశం(ఫోటోలు)

న్యూఢిల్లీ: న్యూ ఢిల్లీ విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి డా. కోడెల శివప్రసాద రావు భారత ...