Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజాపై బాబుకు ఎందుకింత కక్ష-కేంద్రానికంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువా?: వైవీ ప్రశ్న

శుక్రవారం, 17 మార్చి 2017 (16:02 IST)

Widgets Magazine
Roja

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఇదివరకే ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసందే. కాల్ మనీ విషయంలో అసెంబ్లీలో రోజా వ్యవహరించిన తీరుపై ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అయితే తాజాగా అసెంబ్లీలో రోజా తోటి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దురుసుగా ప్రవర్తించారంటూ ఆమెపై మరోసారి సస్పెన్షన్‌కు ప్రివిలేజ్ కమిటీ సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. 
 
టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజ్ కమిటీ మార్చి 4న సమావేశమై రూపొందించిన నివేదికను గురువారం శాసనసభకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా పట్ల అధికార టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. రోజాపై చంద్రబాబుకు ఎందుకింత కక్ష అంటూ ప్రశ్నించారు. 
 
ఇప్పటికే రోజాను ఏడాది పాటు అసెంబ్లీకి దూరం చేసిన ప్రభుత్వం మరోసారి కుట్రకు తెరలేపుతుందని మండిపడ్డారు. రోజా సస్పెన్షన్ పై న్యాయపోరాటం చేస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు పాలనను ఆయన దుయ్యబట్టారు. కేంద్ర జీడీపీ కంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువగా ఉందని చంద్రబాబు చెప్పడం ఆయన దిగుజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
 
ఓవైపు 2018నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతోన్న సీఎం.. ప్రాజెక్టు పూర్తవడానికి రూ.2800కోట్లు అవసరమని చెబుతూనే బడ్జెట్‌లో రూ.200కోట్లే కేటాయించడమేంటని ప్రశ్నించారు. బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని సమాధి చేసేశారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం: మార్చి 16.. ఇండియన్ అమెరికన్ అప్రిసియేషన్ డే..

జాత్యంహకార దాడులకు బలైపోయిన కూచిభొట్ల శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. మార్చి 16వ, ...

news

బావపై రంగు అనుకుని టర్పెంటాయిల్ చల్లేసిన మరదలు-పొయ్యి పక్కనే నిల్చోవడంతో బావ మృతి..

సింగరేణి కాలనీలో హోలీ పండుగ నాడు విషాధ ఘటన చోటుచేసుకుంది. బావపై మరదలు రంగు చల్లాలనుకుంది. ...

news

జైల్లో పడ్డ రేప్ మంత్రి... పిచ్చివాడయిపోతాడేమో? అమిత్ షా అన్నంత పనీ చేశారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంటే అత్యాచారాలకు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పాల్సి వచ్చింది అప్పట్లో. ...

news

కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తే గెలుపే.. సీఎం కావడం ఖాయం.. జోస్యం

తమిళనాడు రాజకీయాల్లో సినీ లెజెండ్ కమల్ హాసన్ అడుగెడితే తప్పకుండా ఆయన సీఎం అవుతారని ...

Widgets Magazine