రాజులు పోయినా, రాజ్యాలు పోయినా ఒకనాటి వైభవానికి, దర్పానికి నిదర్శనంగా.. కాలగర్భంలో కలసిపోయిన రాజసానికి సాక్షీభూతంగా నిలిచినదే కనిగిరి దుర్గం. మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఆనాడు అజేయంగా, అంగరంగ వైభవంగా విలసిల్లిన ఈ కోట.. విజయ మార్తాండ దుర్గంగా, కనకగిరిదుర్గం (బంగారుకొండ)గా ఆ తర్వాత కనిగిరి దుర్గంగా రూపుదాల్చింది. శతాబ్దాల చరిత్ర కలిగిన కనిగిరి దుర్గం... విజయనగర సామ్రాజ్యాధీశులు, గజపతులు, యాదవులు, రెడ్డిరాజులు, రాజ ప్రతిధులు, బహమనీ సుల్తానుల ఏలుబడిలో ఆనాడు ప్రముఖ స్థానాన్ని అలంకరించింది...