శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By Raman
Last Modified: సోమవారం, 15 ఫిబ్రవరి 2016 (16:10 IST)

2016 మే తదుపరి మీకు మంచి అవకాశం రాబోతుంది(మదన్ మోహన్ రాజు- సిద్దవటం)

మదన్ మోహన్ రాజు- సిద్దవటం(కడప)- మీరు అష్టమి గురువారం, కర్కాటక లగ్నము, విశాఖ నక్షత్రం, తులా రాశి నందు జన్మించారు. 2017 వరకూ ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల ప్రతి శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి మల్లెపూలతో శనిని పూజించినా మీకు దోషాలు తొలగిపోతాయి. 2016 మే తదుపరి మీకు మంచి అవకాశం రాబోతుంది. 2017 నుంచి బుధ మహర్దశ 17 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ఏదైనా దేవాలయాలలో మొగలి చెట్టును నాటిన మీకు శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.