శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (11:29 IST)

పెసర పప్పుతో జావ కాచి..?

ఉసిరి ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ కాలంలో దొరికే ఉసిరికాయలు శరీరానికి కావలసిన పోషక విలువలను క్రమంగా అందిస్తాయి. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు శరీరంలోని చెడు మలినాలను తొలగిస్తాయి. ఉసిరికాయలో పులుపు, తీపి, చేదు, వగరు, ఉప్పు ఇవన్నీ కలిసి ఉంటాయి. ఈ ఐదు రుచులు శరీర వేడిని తగ్గించేందుకు ఎంతో సహాయపడుతాయి. 
 
1. బొంగరు గొంతులో బాధపడేవారు ఉసిరికాయల రసంలో కొద్దిగా పాలు, బెల్లం కలిపి తాగితే ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. దగ్గు తగ్గాలంటే.. ఉసిరికాయను పొడిచేసి అందులో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
2. గర్భిణులైతే తరచు వాంతులతో సతమతమవుతుంటారు.. అలాంటివారు.. పెసర పప్పుతో జావ కాచి చల్లార్చి అందులో ఉసిరికాయ రసం కలిపి తాగితే.. వాంతులు రావు. దాంతో చర్మవ్యాధులు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. 
 
3. మూర్ఛ వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఉసిరికాయ చూర్ణంలో తేనె కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తింటుంటే వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. ఎక్కిళ్లను తగ్గించాలంటే.. ఉసిరికాయ రసంలో పిప్పళ్ళ చూర్ణం, తేనె కలిపి తీసుకోవాలి. వెంటనే ప్రతిఫలం కానవచ్చును.
 
4. తరచు వచ్చే జ్వరాల నుండి విముక్తి పొందాలంటే.. ఉసిరికాయలను నేతితో వేడిచేసి తీసుకోవాలి. ఇలా రోజూ చేస్తే జ్వరం ఎన్నటికి మీ దరిచేరదు. ఆకలిలేక బాధపడుతున్నారా.. అయితే.. ఉసిరికాయలు, ఇంగువ, జీలకర్ర, నెయ్యి.. వీటిన్నంటినీ బాగా ఉడికించి తింటే.. మంచిది.