కరక్కాయ పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే...?

మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:55 IST)

ఆయుర్వేదం ప్రకారం మోకాళ్ల నొప్పులను దూరం చేసుకునే చిట్కాలేంటో చూద్దాం.. పిప్పళ్లు, మోడి, శొంఠి ఈ మూడింటిని సమ భాగాలు విడివిడిగా తీసుకుని.. వేయించుకోవాలి. ఆ తర్వాత మెత్తగా దంచి చూర్ణం చేయాలి. 50 గ్రాముల చూర్ణానికి 400 గ్రాముల పెరుగు, 400 గ్రాముల నువ్వుల నూనె కలపాలి.

పెరుగు తడి అంతా ఆరిపోయి, నూనె మాత్రమే మిగిలే దాకా పొయ్యి, మీద మరిగించాలి. ఆ తర్వాత దించి చల్లార్చాలి. ఈ నెను వడగట్టి, భద్రపరుచుకుని నొప్పలు ఉన్న చోట మర్ధన చేసి, ఉప్పు కాపడం పెడితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే కరక్కాయ గింజలు తీసివేసి, మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి, 60 గ్రాముల మెత్తని సైందవ లవణాన్ని కలిపి, మజ్జిగతో తీసుకుంటే వాతం నొప్పులు తొలగిపోతాయి. ఒక గ్లాసు చిక్కటి గంజిలో ఒక చెంచా శొంఠిపొడి, కలిపి కొంచెం ఉప్పు వేసుకుని తాగుతూ వుంటే.. కీళ్ల నొప్పులు దూరమవుతాయి.

శొంఠి, పిప్పళ్లు, మిరియాలు ఈ మూడింటి చూర్ణాన్ని ''త్రికటు చూర్ణం'' అంటారు. ఒక చెంచా పరిమాణంలో ఈ చూర్ణం తీసుకుని, కొంచెం ఉప్పు కలిపేసుకుని, రోజూ పెరుగుతో కలిపి తింటూ వుంటే మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

శాకాహారం తీసుకోండి.. ఎక్కువకాలం జీవించండి.

శాకాహారం ఆయుష్షును పెంచతుంది. కూరగాయల్లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ...

news

వాకింగ్ చేశాక కొబ్బరి - పండ్ల రసాలు తాగితే...

అన్ని వ్యాయామాల్లోకి నడక ఉత్తమమైన వ్యాయామం. దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి ఒక్కరూ ...

news

గోధుమరవ్వతో బరువు తగ్గండి

గోధుమరవ్వతో ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ స్నాక్స్ టైమ్‌లో ...

news

స్మార్ట్ ఫోన్లను టాయిలెట్లలో వాడుతున్నారా? డయేరియా ఖాయం..

స్మార్ట్ ఫోన్లను ఎక్కడపడితే అక్కడ వాడేస్తున్నారా? స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ...