శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (13:23 IST)

బొజ్జను తగ్గించాలా? ఐతే అనాస ముక్కలు, వాము పొడిని నీటిలో ఉడికించి?

వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జీర్ణసమస్యలు తొలగిపోవాలంటే.. చిన్నా పెద్ద ఎవరైనా.. వంద గ్రాముల వామును ఒక లీటర్ నీటిలో మరిగించి.. ఆ నీరు అరలీటర్ అయ్యాక.. ప్రతిరోజూ ఉదయం పరగడుపున వాము నీటిని తాగాల

వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జీర్ణసమస్యలు తొలగిపోవాలంటే.. చిన్నా పెద్ద ఎవరైనా.. వంద గ్రాముల వామును ఒక లీటర్ నీటిలో మరిగించి.. ఆ నీరు అరలీటర్ అయ్యాక.. ప్రతిరోజూ ఉదయం పరగడుపున వాము నీటిని తాగాల్సిందే. గొంతు సమస్యలను తొలగించుకోవాలంటే కూడా వాము వాటర్ తీసుకోవాలి. 
 
ఆకలేయకపోవడం, తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమయ్యేందుకు, ఉదర సంబంధిత సమస్యలను దూరం చేసుకునేందుకు వామును కషాయంగా తీసుకోవడం మంచిది. రోజూ వాము నీటిని తాగితే ఆస్తమా దరిచేరదు.
 
అర టీ స్పూన్ వామును ఒక లీటర్ నీటిలో మరిగించి.. అరగ్లాసు రోజూ తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇంకా ఆస్తమా వ్యాధి నయం అవుతుంది. అలాగే వాము నూనెను మోకాళ్లకు, కీళ్లనొప్పులకు రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు జలుబు చేస్తే ఛాతిపైన వాము నూనెను రాస్తే మంచి ఫలితం ఉంటుంది. పంటి నొప్పి వుంటే కూడా వాము నూనెను దూదిలో ముంచి పంటిమీద ఉంచితే సరిపోతుంది. వాము పొడి అరస్పూన్, కాసింత ఉప్పును మజ్జిగలో కలిపి తాగితే.. జలుబు, దగ్గు దూరమవుతాయి. వాము చురుకుదనాన్నిస్తుంది. 
 
సోమరితనం ఆవహిస్తే... వాము నీటిని తాగితే.. చలాకీగా తయారవుతారు. ముఖ్యంగా బొజ్జను తగ్గించాలంటే.. రోజూ రాత్రి పూట నిద్రించేందుకు ముందు అనాసపండు ముక్కలు నాలుగు, వాము పొడి రెండు స్పూన్లు తీసుకుని నీటిలో మరిగించాలి. ఆ నీటిలో అనాస పండు ఉడికిన తర్వాత అలాగే మూతపెట్టి.. ఉదయం ఉడికించిన అనాసపండును మిక్సీలో రుబ్బి పరగడుపున తీసుకోవాలి. ఇలా 15 రోజులపాటు చేస్తే బొజ్జ మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.