శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (12:00 IST)

అల్లంరసంతో తేనె కలిపి తాగండి.. రక్తాన్ని శుద్ధి చేసుకోండి.. ఉల్లి, వెల్లుల్లి కలిపి తింటే?

ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే మంచిదట. వారానికి రెండు, మూడు సార్లు బీట్‌రూట్‌ను ఆహారంగా తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్టయితే శరీరములోన

ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే మంచిదట. వారానికి రెండు, మూడు సార్లు బీట్‌రూట్‌ను ఆహారంగా తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్టయితే శరీరములోని అధిక బరువును తగ్గిస్తుందట. 
 
అలాగే, రాత్రిపూట నిద్రకు ఉపక్రమించేందుకు కనీసం రెండు, మూడు గంటలకు ముందు ఆహారాన్ని తీసుకున్నట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందట. అలాగే, మునగాకుతో కాస్త కందిపప్పు, మరియు ఒక కోడిగుడ్డు, కొంచెం నెయ్యి చేర్చి తయారు చేసిన వంటను 41 రోజులు తీసుకున్నట్టయితే శరీరములోని రక్తము శుభ్రపడుతుందని నాటు వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, అల్లంరసంతో కాస్త తేనె కలిపి తిన్నట్టయితే రక్తము శుభ్రమవుతుంది. తినే ఆహారాల్లో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు, వెల్లుల్లి కలిపి తిన్నట్టయితే శరీరములోని క్రొవ్వును తగ్గించి ఉత్సాహమును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.