శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 10 నవంబరు 2016 (17:38 IST)

కొత్తిమీర జ్యూస్‌ను తీసుకుంటే.. బీపీకి చెక్.. కంటిచూపు మెరుగవుతుందట..

కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపున తీసుకునేవారిలో బీపీ కంట్రోల్‌లో ఉంటుందట. అంతేకాకుండా కంటిచూపు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొత్తిమీర జ్యూస్ ఎలా చేయాలంటే..? ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి,

కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపున తీసుకునేవారిలో బీపీ కంట్రోల్‌లో ఉంటుందట. అంతేకాకుండా కంటిచూపు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొత్తిమీర జ్యూస్ ఎలా చేయాలంటే..? ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి, కట్‌ చేసి పెట్టుకోవాలి. రెండు టీ స్పూన్ల నిమ్మరసం, అర టీ స్పూన్‌ ఉప్పు, ఒక గ్లాస్‌ వాటర్‌ తీసుకొని అన్నింటినీ మిక్సర్‌లో మెత్తగా గ్రైండ్‌ చేయాలి. 
 
ఈ మిశ్రమాన్ని వడపోయకుండా అలానే తాగాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకున్న అరగంట వరకు ఏ ఆహారం తీసుకోకూడదు. దీనివల్ల షుగర్, కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్‌లో ఉంటాయి. 
 
అంతేగాకుండా కొత్తిమీర చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని మలినాలను టాక్సిన్ల రూపంలో వెలివేస్తుంది. క్యాన్సర్‌ సెల్స్‌ మీద పోరాడుతుంది. స్త్రీలలో రుతు సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.