బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (11:25 IST)

ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసే కరివేపాకు..

కరివేపాకులో హానికర సూక్ష్మజీవుల్ని నశింపజేసే గుణాలున్నాయి. తద్వారా ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. పొట్టలోని విషపూరితాలను సైతం కరివేపాకు చక్కగా తొలగిస్తుంది. అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచుతుంది.

కరివేపాకులో హానికర సూక్ష్మజీవుల్ని నశింపజేసే గుణాలున్నాయి. తద్వారా ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. పొట్టలోని విషపూరితాలను సైతం కరివేపాకు చక్కగా తొలగిస్తుంది. అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. విరేచనాలు తగ్గాలంటే.. చిన్నరేగుపండు సైజులో కరివేపాకు ముద్దను మజ్జిగతో రెండుమూడుసార్లు తీసుకుంటే సరిపోతుంది. 
 
కరివేపాకులోని అనేక పోషకాలు శిరోజాలను సంరక్షిస్తాయి. అంతేకాదు, దీన్ని నూరి తలకు పెట్టుకుంటే చుండ్రు తగ్గుతుంది. దగ్గూ కఫంతో బాధపడుతుంటే టీస్పూను కరివేపాకు పొడిని తేనెతో తీసుకుంటే ఫలితం ఉంటుంది. కరివేపాకులోని మంచి కొలెస్ట్రాల్‌‌ను పెంచి.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కరివేపాకులోని పీచు కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు కూడా తగ్గుతాయి. ఇది కొవ్వుని సైతం కరిగిస్తుంది. దాంతో బరువు కూడా తగ్గుతారు.