మునగ ఆకులు, మునగ పువ్వులకు ఆ శక్తి వుంది...

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (16:15 IST)

drumstick leaves

మునగాకును రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను నియంత్రించుకోవచ్చు.

అలాగే గర్భాశయంలో వచ్చే కంతుల పరిమాణాన్ని తగ్గించడంలో మునగాకు కీలకంగా పనిచేస్తుంది. మహిళలు గర్భం దాల్చినప్పుడు మునగాకును తప్పనిసరిగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
మునగ ఆకులు, పువ్వుల్లో విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తాయి. తద్వారా ఇన్ఫెక్షన్లు దరిచేరవు. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా జలుబు, జ్వరం తగ్గుతుంది. జలుబు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు మునగాకు సూప్‌ను తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారికి మునగాకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. 
 
అంతేగాకుండా శరీరంలోని ట్యాక్సిన్లను తొలగించుకోవచ్చు. పిల్లల్లో ఎముక సాంద్రతను పెంచే లక్షణాలు మునగాకు, గింజలకూ ఉన్నాయి. మధుమేహం బాధపడేవారు, మధుమేహానికి దూరం కావాలనుకునే వారు వారానికి మూడుసార్లు ఆహారంలో మునగాకు చేర్చుకోవాలి. తద్వారా రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గర్భం రావాలంటే ఇలా చేస్తే సరి...

సాధారణంగా పురుష వీర్యం మహిళల అండంతో ఫలదీకరణం చెందినప్పడు మహిళలు గర్భం పొందుతారు. అలాగే ...

news

నిజ వయసుకన్నా పదేళ్లు తక్కువగా కనిపించాలా... వీటిని తింటే...

పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. మొలకల్లో ఎంజైములూ, యాంటీ ...

news

డైజెస్టివ్ బిస్కెట్లు తింటున్నారా? కాస్త ఆపండి..

తేలికగా జీర్ణమయ్యే బిస్కెట్లు మార్కెట్లలో విరివిగా లభిస్తున్నాయి. డైజస్టివ్ బిస్కెట్లు ...

news

ఎసిడిటీ యమ డేంజర్ గురూ... గ్యాస్‌తో జ్ఞాపకశక్తి నాస్తి...

పొట్టలో మంటగా ఉంటే అశ్రద్ధ చేయవద్దంటున్నారు వైద్యులు. దానివల్ల జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు ...