వెల్లుల్లిని పరగడుపున తింటే ఫలితం ఏమిటి? యాంటీ బయోటిక్‌గా?

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:04 IST)

garlic

వెల్లుల్లితో గుండెపోటును దూరం చేసుకోవచ్చు. శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా తగ్గించి వేస్తుంది. వెల్లుల్లి ఉత్పత్తి చెందించే "ఫైబ్రినోలైసిస్"లు గడ్డకట్టిన రక్తాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తుంది, అంతేకాకుండా, వెల్లుల్లిలో ఉండే చైతన్యవంతమైన మూలకం అయినట్టి "అజోయైన్" రక్తం గడ్డకట్టదాన్ని నివారిస్తుంది. దీని వలన దాదాపు గుండెపోటు గురయ్యే ప్రక్రియ తగ్గుతుంది. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా, కొవ్వు పదార్థాలు, ట్రై-గ్లిసరైడ్‌ల స్థాయిలు గణనీయంగా ఉండటం వలన రక్తం మందంగా మారుతుంది. కావున, రోజు వెల్లుల్లి తినటం వలన వీటి స్థాయిలు తగ్గటం వలన గుండెపోటు కలిగే అవకాశంతో పాటూ, మధుమేహ సంబంధిత స్థాయిలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. 
 
వెల్లుల్లి గురించి తెలియని వారు దాదాపు ఉండరనే చెప్పాలి. వెల్లుల్లిలో ప్రత్యేక ఔషద గుణాలున్నాయి. ఇవి జలుబు, ఫ్లూ, జ్వరం, అధిక రక్త పీడనం, అధిక కొవ్వు పదార్థాల స్థాయిలు, విస్తారిత ప్రోస్టేట్, మధుమేహం, ఆస్టియో ఆర్థరైటిస్, ప్రయాణాలలో కలిగే విరేచనాలకు, ప్రీఎక్లంప్సియా, కరోనరీ ఆర్టేరీ డిసిజేస్, గుండెపోటు,  ధమనుల గట్టిపడటం వంటి సమస్యలను నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 
 
అంతేకాకుండా, వెల్లుల్లి పెద్దప్రేగు క్యాన్సర్, పురీషనాళ, స్టమక్, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లను నిరోధించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉదయనా ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినటం వలన, ఇది మరింత శక్తివంతంగా, సహజ యాంటీ బయాటిక్‌గా పరిశోధనలు తేల్చాయి. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బరువు తగ్గాలా? ఐతే రోజూ గోధుమ రవ్వ ఉప్మా తీసుకోండి...

బరువు తగ్గాలా? అయితే గోధుమ రవ్వను ఉపయోగించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోధుమ రవ్వ వలన ...

news

మధుమేహాన్ని తప్పించుకోవటం ఎలా...కొండల్లో జీవించమంటున్న వైద్యులు.

మధుమేహం, చక్కెర వ్యాధి, డయాబెటిక్.. పేరు ఏదయితేనేం.. ఆ విషయంలో మనదే రికార్డు. ప్రపంచ ...

news

బలమైన గుండె కోసం ఏం చెయ్యాలి?

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎప్పుడూ పని బిజీలో ఉండటం ...

news

ఒక్కసారి చుంబించాడు... ఆ తర్వాత కనబడకుండా పోయాడు... ఫోన్ చేస్తే....

మేమిద్దరం పెళ్లియిన వేర్వేరు వ్యక్తులం. ఏడు నెలల క్రితం అతడితో పరిచయం ఏర్పడింది. ఎంతో ...